లాయర్లతో దురుసు: కోర్టు వద్ద ఏఎస్సై మోహన్ రెడ్డి కొడుకు, సోదరుడు వీరంగం
కరీంనగర్: న్యాయస్థానం ప్రాంగణంలో ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరులు గురువారం హల్‌చల్ సృష్టించారు. అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో ఈ రోజు మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యాడు. పెద్ద సంఖ్యలో అనుచరులతో మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యాడు.
దీనిపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లాయర్ల పట్ల మోహన్ రెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. మోహన్ రెడ్డి అనుచరులు తమపై దాడి చేశారని లాయర్లు ఆరోపించారు. మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేయొద్దని న్యాయవాదులు నిర్ణయించారు.

అక్రమ వడ్డీ వ్యాపారాలకు పాల్పడిన కేసులో న్యాయస్థానంలో వీరంగం సృష్టించిన వారిలో మోహన్ రెడ్డి కుమారుడు అక్షయ్ రెడ్డి, సోదరుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు మీడియా ప్రతినిధులు ఫోటోలు తీసిన సమయంలోను దాడికి యత్నించినట్లుగా తెలుస్తోంది.
ఆ తర్వాత న్యాయవాదులు అడ్డుకోవడంతో మోహన్ రెడ్డి సోదరుడు, కొడుకు గొడవకు వారితోనూ దిగారు. మండిపడిన న్యాయవాదులు దాడి ఘటనను కోర్టు దృష్టికి తీసుకువెళతామని, కేసులు పెడతామని హెచ్చరించారు. వారిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని, మోహన్ రెడ్డిని తిరిగి జైలుకు తరలించారు. మోహన్ రెడ్డి అనుచరులు తమ పైన దాడి చేశారని కరీంనగర్ కోర్టులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications