నిరుద్యోగ మార్చ్ వేళ... బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ; ఓరుగల్లులో టెన్షన్!!
బిజెపి నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్న నేపథ్యంలో వరంగల్లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో మూడు ప్రధానమైన డిమాండ్లతో బిజెపి నేడు నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తుంది. ఇక నేడు ఓరుగల్లు వేదికగా నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ కు సంబంధించి వరంగల్ నగరంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే వాటిని గుర్తుతెలియని వ్యక్తులు చించి వేశారు.
బిజెపి నేతలు ఇది కచ్చితంగా బీఆర్ఎస్ నేతల పనేనని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఒకపక్క బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు రెడీ అవుతుంటే మరొకపక్క కాకతీయ యూనివర్సిటీ క్రాస్ వద్ద కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్థానికనేతలు దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ ఫ్లెక్సీలు తగలబెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఓరుగల్లులో ప్రస్తుతం బిజెపి వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి కొనసాగుతున్న వేళ ఈరోజు ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిని కలిగిస్తుంది.

దీంతో బీజేపీ నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతోపాటు నిరుద్యోగుల సమస్యలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం కోసం, ప్రజా క్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం కోసం భారతీయ జనతా పార్టీ నేడు వరంగల్ వేదికగా నిరుద్యోగ మార్చ్ నిర్వహించనుంది.
నేడు సాయంత్రం 4 గంటలకు కాకతీయ యూనివర్సిటీ వద్ద మార్చ్ ప్రారంభమై హనుమకొండ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరగనుంది. ఈ నిరుద్యోగ మార్చ్ కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరై నిరుద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతతో ఆందోళనలు చెయ్యనున్నారు.

ఈ మార్చ్ కు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల జేఏసీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. బండి సంజయ్ తో పాటు రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, రాష్ట్ర నేతలు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు తదితరులు హాజరుకానున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications