త్వరలో ఆటమ్ బాంబ్ పేలబోతోంది.. : కేటీఆర్‌పై పొంగులేటి సెటైర్లు
వరంగల్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గుమ్మడికాయల దొంగ అంటే.. భుజాలు ఎందుకు తడుముకుంటున్నావ్ కేటీఆర్ అని ఎద్దేవా చేశారు. తొర్రూర్ వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారసభలో ఆయన మాట్లాడారు. కేటీఆర్.. నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు... నీకు పడబోయే శిక్ష ఏంటో నీకు తెలుసు అని అన్నారు.
11 నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటడుతున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు. తల తాకట్టు పెట్టైన డిసెంబర్ లోపు 13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని అన్నారు. రుణమాఫీ అయ్యాక నీ తల ఏ టైరు కింద పెడతావో ఆలోచించుకో అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు. తాను బీఆర్ఎస్‌లో బీఆర్ఎస్‌లో చేరే సమయంలో కేసీఆర్‌ను తండ్రిలా భావించి కాళ్లు మొక్కానని మంత్రి పొంగులేటి చెప్పారు. కానీ, తడిగుడ్డతో గొంతుకోశారని అన్నారు. తనకు నాలుగు గోడల మధ్య కాళ్లు పట్టుకునే అవసరం లేదన్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు.. పొంగులేటి హోంమంత్రా? అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నారని.. తాను కేబినెట్ మంత్రినని.. అన్ని విషయాలపై మాట్లాడతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నానని అంటున్నారని.. పాదయాత్ర చేస్తారో.. మోకాళ్ల యాత్ర చేస్తాడో నిర్ణయం ఆయనే తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
తాను ఆ పార్టీ, ఈ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తారని ఎక్కడా చెప్పలేదని మంత్రి పొంగులేటి తెలిపారు. దానికి శ్రీనివాస్ రెడ్డి అదాని కాళ్లు మొక్కాడని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు చట్టం తెలుసునని, ఎప్పుడు, ఎక్కడ ఏం జరగాలో అది జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వస్వినీ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ అనుమాం్ల ఝాన్సీ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తప్పు చేసిన వాళ్లకు నాటు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. ఆటమ్ బాంబు పేలబోతోందని అన్నారు. జనం సొమ్మును అక్రమమార్గంలో విదేశాలకు పంపారని, ఎంత పెద్ద వాళ్లకైనా చట్టం చుట్టం కాదన్నారు. రూ. 55 కోట్లు ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్లాయో తేలుస్తామన్నారు. తప్పు చేయనివాళ్లు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications