తల్లి గొంతుకోసి హత్య.. ఆపై... నల్గొండ జిల్లాలో దారుణం!

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లిని కొడుకు కత్తితో గొంతు కోసి హతమార్చాడు. కన్నతల్లి అని కూడా చూడకుండా కాటికి పంపాడు. ఆపై అదే కత్తితో గొంతు కోసుకుని ప్రాణం తీసుకున్నాడు. అసలు ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.

నల్గొండ జిల్లాలో దారుణ ఘటన
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నల్గొండ జిల్లా నిడమానూరు మండల కేంద్రంలో ఉండే రావిరాల సాయమ్మ ఆమె కొడుకు రావిరాల శివతో కలిసి జీవిస్తుంది. అయితే సంవత్సరం క్రితం శివకు వివాహం చేయగా, శివ దంపతుల మధ్య గొడవల కారణంగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు.ఇక ఇటీవల వారికి విడాకులు మంజూరయ్యాయి.

atrocity in nalgonda son killed mother and after committed suicide

తల్లిని హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్న కొడుకు
దీంతో గత కొద్ది రోజులుగా తల్లి కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక ఈ గొడవలు తారా స్థాయికి చేరుకోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన శివ తల్లి సాయమ్మ గొంతు కోసి హతమార్చాడు. తల్లి కనీసం ఊహించని ఘటనతో కొడుకు చేసిన దారుణానికి బలైపోయింది. అనంతరం అతడు కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘాతుకానికి కారణం ఇదే
అయితే శివ మానసిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగానే ఈ దారుణ ఘటన జరిగి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. అతని తీరు చాలా కాలంగా అలాగే ఉందని బంధువులు అంటున్నారు. మానసిక ఆరోగ్యం బాగా లేకనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని చెప్తున్నారు.

రోజు రోజుకీ పెరుగుతున్న దారుణాలు
ఏది ఏమైనా రక్తసంబంధాలను మరిచిపోయి దారుణ ఘటనలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. నవ మాసాలు మోసి కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులని చిన్న చిన్న కారణాలకే హతమార్చడం ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తుంది. మనుషుల మనసులలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి ఇటువంటి ఘటనలకు కారణమవుతుంది.

ఆందోళనకరంగా హత్యలు
ప్రస్తుతం జరుగుతున్న అనేక హత్యలు, ఆత్మహత్యలు సభ్య సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కారణాలు ఏవైనా చంపటం,ఆత్మహత్యలకు పాల్పడటం వంటి ఘటనలు దారుణం. సమస్య ఏదైనా ఆలోచించి పరిష్కారం చేసుకోవాలి కానీ ఇలా దారుణాలకు పాల్పడటం ఏ మాత్రం మంచిది కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+