అంగన్‌వాడీ టీచర్‌ పై అమానుషం: బట్టలు చించేసి స్థానికుల దాడి; అసలేం జరిగిందంటే

మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ టీచర్ పై ఓ తండావాసులు అమానుషానికి పాల్పడ్డారు. తండా వాసులు అంగన్ వాడీ టీచర్ పై దాడికి తెగబడ్డారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలంలోని ఇస్లావత్ తండా గ్రామ పరిధిలో తేజావత్ తండాలో జరిగిన ఘటనలో అంగన్ వాడీ టీచర్ కమల పై స్థానికులు దాడికి దిగారు. అంగన్ వాడీ టీచర్ కమలకు స్థానికులకు మధ్య గత కొంతకాలంగా వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి అవి కాస్త వారి మధ్య తీవ్ర ఘర్షణకు దారితీశాయి. స్థానికుల దాడిలో కమల గాయాల పాలయ్యారు.

తన పుస్తెలతాడు, సెల్ ఫోన్ ను దాడిచేసిన వారు ఎత్తుకెళ్లారు అని బాధితురాలు లబోదిబోమంది. దుస్తులు చింపేసి తనపై దాడికి పాల్పడ్డారని అంగన్ వాడీ టీచర్ కమల పేర్కొంది. అంగన్ వాడీ కేంద్రంలో ఆహారం, కోడిగుడ్లు పంపిణీ విషయంలో స్థానికులు గొడవకు దిగారని, సూపర్ వైజర్ కు ఫిర్యాదు చేశారని కమల చెబుతున్నారు. స్థానిక సర్పంచ్ రాజీనామా చేయాలని తనపై ఒత్తిడి తీసుకువచ్చారని, అందుకు అంగీకరించకపోవడంతో తనపై దాడికి పాల్పడ్డారని కమల ఆరోపిస్తున్నారు. దాడి అనంతరం కురవి పోలీసులకు ఫిర్యాదు చేసిన కమల, తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కురవి పోలీసులు సెక్షన్ 143, 353, 354, 290, 323, R/w 149 ipc కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. దాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.

Attack on Anganwadi teacher by locals in mahabubabad

ప్రభుత్వం సరఫరా చేస్తున్న పోషకాహారాన్ని పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించి అంగన్వాడీ కేంద్రాలు పని చేయాల్సి ఉంది. అంగన్వాడీ టీచర్లు వివిధ రకాల పిండివంటలు, పోషకాలు ఉండే ఆకుకూరలు, పప్పు దినుసులు, గుడ్లతో వంటలు తయారు చేసి పిల్లలకు అందించి వారిలో పౌష్టికాహార లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత నిర్వర్తించాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంగన్వాడీ కేంద్రాలలో టీచర్ల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా అంగన్ వాడీ టీచర్ పై దాడి నేపధ్యంలో మహబూబాబాద్ జిల్లాలో దీనిపై చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+