భ‌క్తుల‌కు గ‌మ‌నిక‌.. ఇక‌నుంచి యాదాద్రి కొండ‌పై ఇది నిషేదం!

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్య‌క్షేత్రాల‌లో యాదాద్రి ఒక‌టి. ఈ ఆధ్యాత్మిక ప్ర‌దేశాన్ని తెలంగాణ తిరుప‌తి అని కూడా పిలుస్తుంటారు. ఈ కొండ‌పై కొలువై ఉన్న న‌ర‌సింహాస్వామిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు నిత్యం తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తుంటారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతోంది. అయితే, యాదాద్రి వెళ్లే భ‌క్తుల‌కు ఓ ముఖ్య‌మైన గ‌మ‌నిక‌.. ఇక‌నుండి యాదాద్రి కొండ‌పై ప్లాస్టిక్‌ను నిషేదిస్తున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుప‌తి త‌ర్వాత భ‌క్తులు అత్య‌ధికంగా సంద‌ర్శించే ఆల‌యం యాదాద్రి అని చెప్పుకోవ‌చ్చు. అందుకే ఈ ఆల‌య ర‌ద్దీ కూడా పెరిగింది. ఆల‌య అధికారులు భ‌క్తుల సౌక‌ర్యార్థం అనేక ఏర్పాట్ల‌ను కూడా చేస్తున్నారు. ఈ మేర‌కు ఆల‌య అధికారులు ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. తిరుమ‌ల తిరుప‌తి త‌ర‌హాలో ఈ కొండ‌పై కూడా ప్లాస్టిక్‌పై నిషేదాన్ని విధించారు.

తిరుమ‌ల ఆల‌యంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా టీటీడీ ప్లాస్టిక్‌ను నిషేదించింది. ఇదే ప‌ద్ధ‌తిని అన్నవ‌రం దేవ‌స్థానంలోనూ పాటిస్తున్నారు. ఇప్పుడు యాదాద్రిలోనూ ప్లాస్టిక్‌పై అధికారులు నిషేదం విధించారు. ఈ ఆలయాల్లోకి భక్తులు, సిబ్బంది ఎవరూ ప్లాస్టిక్ వంటి వస్తువులేవీ తీసుకెళ్లటానికి వీళ్లేదు. పర్యావరణ పరిరక్షణలో భాగాంగా ప్లాస్టిక్ వాడకం నిషేదిస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

Attention to the devotees plastic ban on Yadadri hill from now

ఈ మేరకు దేవస్థానంలోని వివిధ భాగాలకు ఈవో ఉత్తర్వులు కూడా జారీ చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం విధించినట్లు అధికారులు వెల్లడించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ప్లాస్టికేతర వస్తువులు ఉపయోగించాలని ఆల‌య అధికారులు సూచించారు. ఈ నిషేదాన్ని ఆల‌య సిబ్బంది విధిగా పాటించాలన్నారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు కూడా ప్లాస్టిక్ కవర్లు తీసుకురాకూడదని ఆల‌య అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+