ఆటోల ఛార్జీలు భారీగా పెంపు - కొత్త ధరలు ఇలా.. రాత్రి వేళ ఇక..!!

ఆటో ప్రయాణం మరింత భారంగా మారనుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆటో మీటర్ ఛార్జీల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆటో సంఘాల నుంచి వస్తున్న నిరంతర విజ్ఞప్తులను పరిశీలించిన సర్కార్, కొత్త ధరలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కనీస ధర నుంచి.. ప్రతీ కిలో మీటర్ కు ధరలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిటెన్షన్ ఛార్జీలను ప్రతిపాదించారు. ప్రభుత్వం అధికారిక ఆమోదం తో కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

తెలంగాణలో ఆటోల మీటర్‌ చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైంది. పెరిగిన ధరల నేపథ్యంలో మీటరు చార్జీలు పెంచాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తలపెట్టిన సమ్మె డిమాండ్లలోనూ మీటరు చార్జీల పెంపును ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో దాదాపు 2014 సంవత్సరం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా అవే పాత మీటర్ ఛార్జీలు కొనసాగుతూ వస్తున్నాయి. కాలం మారుతున్న కొద్దీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాలను గుర్తించి, దశాబ్ద కాలం తర్వాత ఛార్జీలను సవరించాలని ఆటో డ్రైవర్ల సంఘాలు చేసిన డిమాండ్లకు ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో, చార్జీల పెంపుపై రవా ణాశాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆటోరిక్షాల కనీస చార్జీని ప్రస్తుత రూ.20 నుంచి రూ.30కి పెంచాలని కమిటీ ప్రతిపాదించింది.

BRS నేతలతో కేసీఆర్ భేటీ - రాజీనామా, బస్సు యాత్ర పై కీలక నిర్ణయం..!?
BRS నేతలతో కేసీఆర్ భేటీ - రాజీనామా, బస్సు యాత్ర పై కీలక నిర్ణయం..!?
auto-rickshaw-fares-set-for-hike-as-committee-proposes-30-minimum-fare-new-tariff-details-here

రాత్రి వేళ 50 శాతం అదనపు ఛార్జీలు

అదే విధంగా తొలి 1.6 కిలోమీటర్లకు రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14 చొప్పున వసూలు చేసేలా కొత్త టారిఫ్ ను సూచించింది. ఆటో ట్రాఫిక్‌లో నిలిచినప్పుడు ప్రతి నిమిషానికి 75 పైసల డిటెన్షన్‌ చార్జీ విధించాలని ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆమోదించి అధికారిక ఉత్తర్వు లు జారీ చేసిన తర్వాతే కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. కొత్త టారిఫ్ ను ఆమోదిస్తే డిజిటల్‌ ఆటో మీటర్లను కొత్త చార్జీలకు అనుగుణంగా రీసెట్‌ చేసేందుకు మూడు నెలల సమయం ఇవ్వాలని రవాణా శాఖ కోరింది. ఈ వ్యవధిలో ప్రతి ఆటోలో పాత, కొత్త చార్జీలను తెలిపే ఆమోదిత టారిఫ్‌ కార్డును ప్రదర్శించాలని ప్రతిపాదించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేయాలని ప్రతిపాదించారు. కాగా.. బ్రీఫ్‌కేస్‌, హ్యాండ్‌బ్యాగ్‌ కాకుండా ఇతర ప్రతి ప్యాకేజీకి 50 పైసలు చొప్పున వసూలు చేయాలని సూచించారు. గరిష్ఠంగా 100 కిలోల సామానును అనుమతించాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+