అడుగడుగునా ఏపీకి కేంద్రం అండ.. తాజాగా వారికోసం నిధులు, ట్రైనింగ్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా అండదండలు అందిస్తోంది. ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో స్వదేశీ తయారీ వస్తువులను ప్రమోట్ చేస్తున్న కేంద్రం సంప్రదాయ హస్తకళలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు సహకారం అందిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 770 మంది హస్తకళాకారులకు ఆధునిక డిజైన్లు, కొత్త తయారీ పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి రూ.1.35 కోట్లు మంజూరు చేసింది.

హస్త కళాకారుల కోసం కేంద్ర నిధులు

ఇందులో మొదటి విడతగా రూ.1.01 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఈ నిర్ణయం ఏపీకి అన్ని రంగాల్లో కేంద్రం అడుగడుగునా సహకరిస్తున్న విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది.రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఈ మేరకు ప్రకటన చేశారు. మారుతున్న ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా సంప్రదాయ కళలను కాపాడుతూనే ఆధునిక రూపం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయన్నారు.

పాకిస్తాన్ కు కేంద్రం చెక్- సింధూ నదీ జలాల విషయంలో బిగ్ స్టెప్
పాకిస్తాన్ కు కేంద్రం చెక్- సింధూ నదీ జలాల విషయంలో బిగ్ స్టెప్
Centre support to ap centre Sanctions Rs 1 35 Crore for Handicraft Artisan Training in Andhra Pradesh

హస్త కళాకారులకు ఆర్ధిక భరోసా కల్పించే లక్ష్యం

హస్త కళాకారులకు ఆధునిక డిజైన్ లపై శిక్షణ ద్వారా మెరుగైన ఉపాధి, ఆదాయం, ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం చేనేత రంగంతో పాటు హస్తకళాకారులకు కూడా ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అందిస్తున్న నిధులు, సాంకేతిక సహకారం కీలకంగా నిలుస్తున్నాయి.

హస్త కళాకారులకు శిక్షణ ఇలా

హస్త కళాకారులకు శిక్షణ రెండు రకాలుగా నిర్వహించనున్నారు. గురు-శిష్య హస్త శిల్ప్ ప్రశిక్షణ్ కింద రెండు నెలల పాటు, డిజైన్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్ కింద నెల రోజుల పాటు శిక్షణ ఇస్తారు. చెక్క బ్లాక్, కలంకారి, దుర్గి రాతి శిల్పం, అగరుబత్తి, తాటి ఆకుల కళ, కొబ్బరి చిప్పల కళ, టెర్రకోట, లేస్, వెదురు-చెరకు కళలు, బొబ్బిలి వీణ, ఇమిటేషన్ జ్యువెలరీ వంటి పలు కళారూపాలపై శిక్షణ అందించనున్నారు.

ప్రైవేటుకు భూగర్భ బొగ్గు గనులు.. కేంద్రం సూచన .. సింగరేణి యోచన!
ప్రైవేటుకు భూగర్భ బొగ్గు గనులు.. కేంద్రం సూచన .. సింగరేణి యోచన!

సాంప్రదాయ కళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు

అనంతపురం, పల్నాడు, అనకాపల్లి క్లస్టర్లకు చెందిన 200 మంది కళాకారులకు ప్రత్యేక శిక్షణతో పాటు ఆధునిక పనిముట్లు కూడా పంపిణీ చేయనున్నారు. కృష్ణా, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం సహా 15కు పైగా జిల్లాల కళాకారులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారు. కేంద్రం ఇలా నిధులు మంజూరు చేయడం ద్వారా ఏపీలోని సాంప్రదాయ కళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచే వీలుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+