అయ్యప్ప మాలధారుల ఆగ్రహం.. డీజీపీ కార్యాలయం ముట్టడి.. ఉద్రిక్తత!

తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న వారిపైన పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు ఆందోళనలకు, ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. పోలీస్ శాఖలో డ్యూటీలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష లేదా ఇతర మతపరమైన దీక్షలు చేపట్టరాదని చెప్పడం దీక్ష చేసే సిబ్బంది తప్పనిసరిగా సెలవు తీసుకొని మాత్రమే కొనసాగించాలని సూచించడం అయ్యప్ప స్వాముల ఆగ్రహానికి కారణమైంది.

అయ్యప్ప భక్తులకు పోలీస్ శాఖ షాక్
డ్యూటీ లో ఉండి పోలీసు శాఖ నిబంధనలు ఉల్లంఘించారని సౌత్ ఈస్ట్ జోన్ కంచన్ బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు పోలీస్ శాఖ మెమో జారీ చేసింది .అంతేకాకుండా పోలీసులు జుట్టు, గడ్డం పెంచుకోరాదని స్పష్టం చేసింది. షూస్ లేకుండా సివిల్ డ్రెస్ లో డ్యూటీ చేయవద్దని హెడ్ ఆఫీస్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ క్రమంలో పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలు అయ్యప్ప స్వాములకు ఆగ్రహం తెప్పించాయి.

Ayyappa devotees anger siege of DGP office created tension

డీజీపీ కార్యాలయం ముట్టడించిన అయ్యప్ప స్వాములు, బీజేవైఎం నాయకులు
అయ్యప్ప మాల ధరించిన కంచన్ బాగ్ ఎస్ ఐ కృష్ణ కాంత్ కు పోలీస్ శాఖ రూల్స్ బ్రేక్ చేశారని మెమో ఇవ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాలతో పాటు అయ్యప్ప స్వాములు మండిపడుతున్నారు. అయ్యప్ప స్వాములతో కలిసి, బీజేవైఎం కార్యకర్తలు నేడు డిజిపి కార్యాలయాన్ని ముట్టడించారు. నగర పరిధిలో ఉన్న అయ్యప్ప స్వాములు డిజిపి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన దీక్ష చేపట్టారు. డీజీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.

పోలీస్ శాఖ తీరును ప్రశ్నించిన అయ్యప్పలు.. అడ్డుకున్న పోలీసులు
బీజేవైఎం కార్యకర్తలతో పాటు, అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకోగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పోలీసులు ప్రవర్తిస్తున్నారని అయ్యప్ప స్వాములు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల యూనిఫాం పైన ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. ఇతర మతాల వాళ్ళు చేపడితే వారికి అన్ని విధాల సహకరించే పోలీసులు హిందువుల విషయంలోనే ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

నిరసన చేస్తున్న అయ్యప్ప స్వాముల అరెస్ట్
ఈ నిరసన కార్యక్రమంలో నగర పరిధిలోని అయ్యప్ప స్వాములు ఉన్నతాధికారులు తక్షణ ఎస్ఐకి ఇచ్చిన మేము పై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయం ఎదుట కూడా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టారు. ఇక అయ్యప్ప స్వాములను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+