వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: 24 గంటలు ఆజాద్‌పూర్ మార్కెట్ ఓపెన్, తెలుగురాష్ట్రాల రైతులకు కిషన్ రెడ్డి భరోసా

|
Google Oneindia TeluguNews

తెలుగురాష్ట్రాల రైతు సమస్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో పండ్ల రైతులు తమ పంట విక్రయంపై ఇబ్బందిపడ్డారు. విషయం తెలుసుకొన్న కిషన్ రెడ్డి.. ఢిల్లీ మార్కెట్‌కు పండ్ల తరలింపునకు లైన్ క్లియర్ చేశారు. రైతుల పంటను వ్యాపారులు కొనుగోలు చేస్తారని.... ఇబ్బంది పడొద్దని సూచించారు.

 azadpur market will open 24 hours: kishan reddy

కరోనా వైరస్ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా ఉంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. దీంతో ఆజాద్ పూర్ పండ్ల మార్కెట్ కూడా డిఫాల్ట్‌గా క్లోజ్ చేశారు. ఆసియాలోని అతిపెద్ద మార్కెట్‌గా ఆజాద్ పూర్ మండీకి పేరు ఉంది. తెలుగురాష్ట్రాల నుంచి ఇక్కడికి పండ్లు వస్తుంటాయి. అయితే ఈ సారి విక్రయంపై ఒకింత ఆందోళన నెలకొంది.

Recommended Video

New Infection In 3 To 11 Years Of Age Kids In AP

తెలుగురాష్ట్రాల రైతుల సమస్యను తెలుసుకొన్న కిషన్ రెడ్డి.. ఆజాద్ పూర్ మార్కెట్ తెరచి ఉండేలా చర్యలు తీసుకున్నారు. మార్కెట్ 24 గంటలు తెరచి ఉంటుందని స్పష్టంచేశారు. పండ్ల రైతులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఆజాద్ పూర్‌కు నల్గొండ జిల్లా నుంచి ప్రతీ ఏటా 30 వేల మెట్రిక్ టన్నుల బత్తాయి వస్తోంది. ఈ సారి ఆందోళన నెలకొనగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో సమస్య పరిష్కారమైంది.

English summary
azadpur market will open 24 hours central minister kishan reddy told to telugu states farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X