అనుమానమే పనుభూతమై .. ప్రేమోన్మాదిగా మారి బీటెక్ విద్యార్థినిని గుట్టల్లో దారుణంగా ...
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది. తనను ప్రేమించిన యువతి వేరొక యువకుడితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో, అది సహించలేని యువకుడు యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

ఒకే కళాశాల విద్యార్థులు .. ప్రేమోన్మాదంతో విద్యార్థినిని హతమార్చిన సహ విద్యార్ధి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకపల్లిలో తేజస్విని,నితిన్ లు ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతున్నాడు. బీటెక్ చదువుతున్న ఈ ఇద్దరు డిప్లమా చదివే రోజుల నుండి ప్రేమించుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసుల చేత ఇరువురికి కౌన్సిలింగ్ ఇప్పించారు. డిప్లమా చదివే సమయంలోనే నితిన్ తేజస్విని ప్రేమించుకుంటున్నారని తెలిసి వారిద్దరికి కెరీర్ ఇంపార్టెంట్ అని చెప్పి మందలించి చదువు పైన శ్రద్ధ ఉంచాలని తల్లిదండ్రులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రేమోన్మాది చేతిలో ప్రస్తుతం విగతజీవిగా మారిన తేజస్విని , చంపినా నితిన్ ఇద్దరూ ఒకే కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు కావటంతో ఆ కళాశాల యాజమాన్యం షాక్ కు గురయ్యింది.

వేరే యువకుడితో చనువుగా ఉంటుందంటూ అనుమానం .. అటవీ ప్రాంతంలో దారుణం
అయితే ఆ తరువాతతేజస్వినితనను ప్రేమిస్తూ వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో నితిన్ తేజస్వినితో తరచూ గొడవలు దిగుతున్నాడు . మూడు రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన తేజస్విని ఇంటికి రాకపోవడంతో ఆమె ఆచూకి కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నితిన్ పైన తమకు అనుమానం ఉందని తేజస్విని తల్లిదండ్రులు చెప్పారు. ఈరోజు తెల్లవారుజామున గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో తేజస్సుని మృతదేహం లభ్యం కావడంతో, ఇది నితిన్ చేసిన పని అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

లొంగిపోయిన హంతకుడు ..కేసు నమోదు చేసుకున్న పోలీసులు ...
ఇక మూడు రోజుల క్రితం తేజస్విని కి ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పి పెనుబల్లి రమ్మన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్ళిన తేజస్విని అత్యంత దారుణంగా హతమార్చి నితిన్ లంకపల్లి గుట్టల్లో పడేసి వెళ్ళినట్లుగా పోలీసులు చెబుతున్నారు. తేజస్విని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే పోలీసులకు లొంగిపోయిన నితిన్ ను విచారిస్తున్నట్లు గా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం నితిన్ లొంగిపోయిన విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.కేవలం అనుమానం, ప్రేమోన్మాదం వెరసి ఒక బీటెక్ విద్యార్థిని ఉసురు తీసింది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications