Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వద్దంటే తీసుకువచ్చారు: కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసిన బాబు మోహన్

సంగారెడ్డి: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బీజేపీ నేత, మాజీ మంత్రి బాబు మోహన్ ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వచ్చిందని చాలా సంతోషించానని, తెలంగాణ ప్రజలకు విలువ, గౌరవం వచ్చిందని అనుకున్నానని, కానీ కేసీఆర్ పాలనలో అహో.. ఓహో అనుకున్నానని, కానీ నీళ్లు ఇవ్వకముందే ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.

చదవండి: రేవంత్ ఎఫెక్ట్, నాదే పొరపాటు: రూ.10 కోట్లపై నాయిని, కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై..

తనకు టిక్కెట్ ఇచ్చేమందు ఇప్పుడు టిక్కెట్ ఇచ్చిన బ్రోకర్‌కే ఇవ్వవచ్చు కదా అని ధ్వజమెత్తారు. కొడుకు కోస ఎన్నికలు అని ఆరోపించారు. వద్దంటే తనను రాజకీయాల్లోకి తీసుకు వచ్చారని, దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు.

Babu Mohan lashes out at KCR, KTR and Harish Rao

భారతీయ జనతా పార్టీ దళితులకు గౌరవం ఇచ్చే పార్టీ అని, అందుకే చేరానని చెప్పారు. దళితులను రాష్ట్రపతి చేసిన పార్టీ బీజేపీ అన్నారు. మెడ నరుక్కుంటానన్నాయన టికెట్ ఇవ్వలేదని, అర్జంటుగా ముఖ్యమంత్రి కావాలని కొడుకు (కేటీఆర్), బిడ్డ (కవిత), అల్లుడూ (హరీష్ రావు), మనవడికి ఉందని విమర్శించారు.

తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క పైసా అప్పు తేలేదని, తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు అప్పులయ్యాయన్నారు. ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పొద్దున లేస్తే హరీష్ రావు ఇంటి గేట్ దగ్గరే ఉంటారని, ఇలాంటి వ్యక్తిని గెలిపించవద్దన్నారు.

Recommended Video

    కేసీఆర్ పై బాబు మోహన్ మండి పాటు

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+