ఓడిపోతే కేసీఆర్ , కేటీఆర్ లు కూడా ఔట్ డేటెడ్ అవుతారా ? బీజేపీనేత బాబు మోహన్ ప్రశ్న
తెలంగాణాబీజేపీ శ్రేణుల్లో నడ్డా పర్యటన జోష్ నింపింది. తెలంగాణా రాష్ట్రానికి వచ్చిన నడ్డా భారీ బహిరంగ సభా వేదికగా తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ అవినీతి పాలన చేస్తుంది అంటూ విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో చేసిన దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇక నడ్డా వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఒకే ఒక్క సీటు గెల్చుకున్న ఔట్ డేటెడ్ పార్టీ అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేత బాబు మోహన్ స్పందించారు.
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని బీజేపీ నాయకుడు బాబు మోహన్ అన్నారు. నేడు ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న ఆయన జేపీ నడ్డా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు కాలం చెల్లనుంది అని ఆయన పేర్కొన్నారు . మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని జేపీ నడ్డా ఆదేశించారని చెప్పిన బాబు మోహన్ బీజేపీలో ముందు ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్నారు. ఎక్కడ ప్రజలు బీజేపీకి పట్టం కడతారో అని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పరిపాలన చేతకాక టీఆర్ఎస్ నాయకులు బీజేపీని విమర్శిస్తున్నారని బాబు మోహన్ మండిపడ్డారు .

బీజేపీ సామర్ధ్యం ఏంటో త్వరలోనే తెలుస్తుంది అన్నారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందో లేదో కొంత కాలం ఆగితే టీఆర్ఎస్‌కు తెలుస్తుందన్నారు బాబు మోహన్ . టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కూల్చటం తప్ప ఏమీ తెలియదన్నారు. రాజకీయాల్లో అవుట్ డేటెడ్ ఉండదని.. ఓడిపోతే కేసీఆర్, కేటీఆర్‌లు అవుట్ డేటెడ్ అవుతారా? అని ఆయన ప్రశ్నించారు . కరీంనగర్‌లో టీఆర్ఎస్ ఎంపీ ఓటమిలో తన పాత్ర ఉందని చెప్పిన బాబు మోహన్ రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణలో తన సత్తా చాటుతుందని పేర్కొన్నారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications