బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రత్యేక క్యాన్సర్ రీసెర్చ్ కేంద్రం ప్రారంభించిన బాలకృష్ణ
క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ఎన్నారై దంపతులు సుద్నగుంట కళ్యాణి మరియు ప్రసాద్ లు 10 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.
క్యాన్సర్ పై పరిశోధనలకు ఈ రీసెర్చ్ సెంటర్ ఉపయుక్తం
క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించిన క్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ పై పరిశోధనలకు ఈ రీసెర్చ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రవాసాంద్రులు ఇచ్చిన సహాయంతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రానికి కళ్యాణి, ప్రసాద్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ గా నామకరణం చేసినట్టు పేర్కొన్నారు.

క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ వైద్య చికిత్స
తన తండ్రి ఎన్టీఆర్ ఆశయంతో ఈ హాస్పిటల్స్ స్థాపించబడింది అని, నటన ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన దైవం తన తండ్రి అని ఆయన కలల సాకారంగా ఈ ఆసుపత్రి రూపుదిద్దుకుందని బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ వైద్య చికిత్సను అందించే విధంగా ఆయన తెలిపారు.
క్యాన్సర్ పైన పరిశోధనలకు శుభారంభం
2000 సంవత్సరంలో 110 బెడ్ లతో ప్రారంభమైనటువంటి క్యాన్సర్ ఆస్పత్రి ప్రస్తుతం 650 బెడ్ ల సామర్థ్యంతో క్యాన్సర్ ఆస్పత్రిగా ఎదిగిందని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేసి క్యాన్సర్ పైన పరిశోధనలను మరింత అభివృద్ధి చేయడానికి శుభారంభం జరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆవిష్కరణలకు రీసెర్చ్ సెంటర్
అత్యాధునిక సాంకేతికతతో కూడిన రీసెర్చ్ సెంటర్ ను నిర్మించి క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆవిష్కరణలను సాధించే లక్ష్యంతో ఆసుపత్రి బృందం పనిచేస్తుందని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ అందించే అత్యుత్తమ వైద్య సేవలు, సబ్సిడీ రేట్లలో చికిత్స అందించడం ప్రజలందరి మన్ననలు పొందిందన్నారు.
చికిత్సతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న బాలయ్య
బాలయ్య. క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో చికిత్సతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ముందడుగు వేస్తుందని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications