చెన్నై- న్యూ ఢిల్లీ రూట్లో బల్లార్షా- గూడూరు నాలుగో రైల్వే లైన్ పై కేంద్రం శుభవార్త!

బల్లార్షా-కాజీపేట-విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ ముఖ్యమైన ప్రాజెక్టుకు కేంద్ర రైల్వే శాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 744.80 కిలోమీటర్ల పొడవైన ఈ లైన్‌తో పాటు ఇందుపల్లి-దుగ్గిరాల మధ్య 36.80 కిలోమీటర్ల డబుల్ లైన్ పనులకు కూడా అధికారిక ఆమోదం లభించింది. ఈ నోటిఫికేషన్‌తో భూసేకరణ ప్రక్రియకు కీలక అడుగు పడింది.

ఈ ప్రాజెక్టు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపట్టబడుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా నుంచి తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు ఈ మార్గం విస్తరించి ఉంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై-న్యూఢిల్లీ రూట్‌లో భాగమైన ఈ లైన్ ప్రయాణికులు, సరుకు రవాణా రైళ్లకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.

Ballarsha-Gudur railway line Chennai-New Delhi route Fourth Railway Line Gains Momentum with Gazette Notification

ఇప్పటికే కాజీపేట-బల్లార్షా, కాజీపేట-విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. నాలుగో లైన్ పూర్తయితే రైళ్ల రద్దీ గణనీయంగా తగ్గుతుంది. రైళ్ళ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. బొగ్గు, సిమెంట్, ఇనుప ధాతువు వంటి సరుకుల రవాణా కూడా సులభతరం కానుంది.

ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక రైతులు, ప్రజలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. పరిహారం, పునరావాసం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. ఈ నాలుగో లైన్ పూర్తయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది.

తెలంగాణాలో వారికి ఉచిత బస్సులు.. పరిశీలిస్తున్న రేవంత్ సర్కార్!
తెలంగాణాలో వారికి ఉచిత బస్సులు.. పరిశీలిస్తున్న రేవంత్ సర్కార్!

ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వ్యాపార, పారిశ్రామిక రంగాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా గుర్తించి, వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడంతో పనులు మరింత ఉత్సాహంగా సాగనున్నాయి. రద్దీగా ఉండే చెన్నై-న్యూఢిల్లీ రూట్‌లో ఇది ఒక కీలక లైన్ గా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+