బండి భగీరథ్ ను కస్టడీ కోరిన పోలీసులు..పోక్సో కోర్టు నిర్ణయం ఇదే!

తెలంగాణలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను తమ కస్టడీలోకి తీసుకొని మరింత లోతైన విచారణ చేపట్టాలని తెలంగాణ పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. మల్కాజ్‌గిరి పోక్సో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు మే 26వ తేదీకి వాయిదా వేసింది.

బండి భగీరథ్ ను కస్టడీకి కోరిన పోలీసులు

ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్‌పై ఈ కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీ అవసరమని వాదించారు. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, సాక్షులను మరింత వివరంగా విచారించడం, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించడం వంటి అంశాల కోసం అతన్ని తమ అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Bandi Bhageerath pocso case Police have filed a custody petition court adjourned hearing

భగీరథ్ నుండి లభించని సాక్ష్యాలు

కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటికే బాధిత బాలిక మరియు ఆమె తల్లిని విచారించి ముఖ్యమైన సమాచారం సేకరించింది. అలాగే భగీరథ్ 10 మంది స్నేహితులను కూడా విచారణకు హాజరు చేసి వారి వద్ద నుంచి కీలక విషయాలు తెలుసుకుంది.అయినప్పటికీ, భగీరథ్ సెల్‌ఫోన్ నుంచి ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు.

ఫోన్ డేటా రికవరీ కష్టంగా.. ఆధారాలు నాశనం చేసినందుకు అదనపు సెక్షన్లు

సిమ్ లేకుండా ఫోన్ ఇవ్వడంతో డేటా రికవరీ చేయడం సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. "సిమ్‌ను ఎక్కడో పెట్టి మర్చిపోయాను" అని భగీరథ్ చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆధారాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారనే సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ రుజువైతే ఆయనకు మరింత కఠినమైన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

18 కిలోమీటర్లు మంత్రి నిమ్మల సైకిల్ డబుల్​ రైడ్!
18 కిలోమీటర్లు మంత్రి నిమ్మల సైకిల్ డబుల్​ రైడ్!

మే 26న ఈ కస్టడీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం

బండి భగీరథ్ తరఫున హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా ఇటీవల ఉపసంహరించుకున్నారు. అరెస్టు అయిన తర్వాత ఆ పిటిషన్‌కు ప్రయోజనం లేదని లాయర్ తెలిపారు.పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుని, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి భద్రత మరియు ఆమె వైద్య పరీక్షల నుంచి మొదలుకొని, డిజిటల్ ఆధారాల వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కోర్టు మే 26న ఈ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+