• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నా ఆయుష్షూ వారిద్దరికీ ఇస్తా: కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ నిప్పులు, ఈటల, అరవింద్ కూడా

|

నిర్మల్: తెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై నిర్మల్‌ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులకు బండి సంజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అందుకే నిర్మల్ సభ: బండి సంజయ్

అందుకే నిర్మల్ సభ: బండి సంజయ్

ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు బండి సంజయ్‌. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడదామన్నారు. సర్దార్ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదన్నారు. తెలంగాణలో విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.
తెలంగాణ విమోచన వీరులు పైనుంచి చూస్తున్నారన్నారు. ప్రగతి భవన్‌కు బీజేపీ జయధ్వానాలు వినిపించాలన్నారు. తెలంగాణ విమోచన వీరుల చరిత్రను భవిష్యత్‌ తరాలకు తెలియజేసేందుకే నిర్మల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మోడీ, షాలకు తన ఆయుష్షూ కూడా ఇస్తానండూ బండి సంజయ్

మోడీ, షాలకు తన ఆయుష్షూ కూడా ఇస్తానండూ బండి సంజయ్

ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల్లో తెలంగాణ రక్తం ప్రవహిస్తే కేసీఆర్ ప్రభ్యత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ లాంటి మూర్ఖుడు ప్రధాని అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరపడని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి కుటుంబాన్ని కూకటి వేళ్ళతో పెకిలివేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అమరుల త్యాగలతో పాటు కేసీఆర్ క్రూరత్వాన్ని కూడా పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామన్నారు. మూర్ఖుడి చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి అర్థనాదం పెడుతోందన్నారు. మోడీ, అమిత్ షా లేని దేశాన్ని ఉహించుకోలేమని.. అవకాశం ఉంటే తన ఆయుష్ కూడా వారికే ఇస్తానని అన్నారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన మహానుభావుడు అమిత్ షా అని ప్రశంసించారు.

కేసీఆర్ అహంకారానికి ఘోరికడతారంటూ ఈటల రాజేందర్

కేసీఆర్ అహంకారానికి ఘోరికడతారంటూ ఈటల రాజేందర్

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు ఘోరి కడతారన్నారు యావత్ తెలంగాణ తన వెంట ఉందన్నారు. హుజురాబాద్ లో ఎప్పుడూ ఎన్నిక వచ్చిన కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. దేశాన్ని బీజేపీ గొప్పగా పాలిస్తుందన్నారు ఈటల రాజేందర్. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. స్వాతంత్ర్య దినం జరుపుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందని మండిపడ్డారు.

ఈటలను ముందుకు రావాలంటూ ఆహ్వానించిన అమిత్ షా

ఈటలను ముందుకు రావాలంటూ ఆహ్వానించిన అమిత్ షా


కాగా, నిర్మల్ సభ మొత్తం ఈటల రాజేందర్ కేంద్రంగా జరిగింది. సభ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఈటల పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు అమిత్ షా. రెండో వరుసలో కూర్చుకున్న ఆయనను వేదికపై ముందుకు పిలిచి మరీ మాట్లాడారు. తొలిసారి ఈటల పేరు ప్రస్తావించగానే సభ మొత్తం కార్యకర్తల నినాదాలతో మారుమోగింది. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ను గెలిపించి.. రాష్ట్రంలో ఉన్న డబ్బుల రాజకీయానికి, కుటుంబ రాజకీయానికి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చారు అమిత్ షా. ప్రతీ ఎన్నికను డబ్బులతో గెలవొచ్చని టీఆర్ఎస్ అనుకుంటోందని విమర్శించారు అమిత్ షా. తెలంగాణ ప్రజలు రాజేందర్ ను గెలిపిస్తారా? పైసల సర్కారును గెలిపిస్తారా? కుటుంబ పాలనను గెలిపిస్తారా? అని వేధిక ముందున్న వారిని ప్రశ్నించారు.

  Surya Kumar Yadav కి లక్కీగా Rahane బ్యాడ్ టైమ్.. మాజీలు ఆడేసుకుంటున్నారు!! || Oneindia Telugu
  కేసీఆర్ చరిత్ర ఆయనముందే చెరిగిపోతుంది: అరవింద్

  కేసీఆర్ చరిత్ర ఆయనముందే చెరిగిపోతుంది: అరవింద్

  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ అరవింద్ ప్రసంగించారు. తెలంగాణ నేల అంటేనే పౌరుషాల గడ్డ అని, ఇలాంటి పోరాటాల గడ్డపై కేసీఆర్ నిర్బంధపు పాలన చేద్దామనుకుంటున్నారన్నారు. అయితే నిర్బంధాలకు భయపడే నేల ఇది కాదన్నారు. రామదాసును గొల్కొంలోని జైలులో ఖైదీ చేస్తే భక్త రామదాసుగా చరిత్రలో నిలబడిపోయారని చెప్పారు. కానీ, భయపడలేదన్నారు. అలాగే కవి దాశరథిని నిజామాబాద్ ఖిల్లా జైలులో బందీ చేస్తే మహాకవి దాశరథిగా.. తెలంగాణను కోటి రతనాల వీణగా మారుమోగించారని పేర్కొన్నారు. కేసీఆర్ చరిత్ర ఆయన ముందే చెరిగిపోతోందన్నారు. తెలంగాణ విమోచన దినంలో పాల్గొనడానికి అమిత్ షా ఇక్కడకు రావడం మంచి విషయమన్నారు.

  English summary
  Bandi Sanjay and etela rajender slams KCR in Nirmal BJP meeting.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X