మేం ఆ పని చెయ్యం.. మున్సిపల్ ఎన్నికలలో హీటెక్కిస్తున్న ప్రతిజ్ఞలు!

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో ప్రతిజ్ఞల పర్వం కొనసాగుతుంది. ఒక పార్టీలో గెలిచి, ఇంకో పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న 'ఆయా రాం-గయా రాం' సంస్కృతితో రాజకీయాలు కలుషితమవుతున్న తరుణంలో, గెలిచిన తర్వాత పార్టీని వీడబోమని, బీజేపీలోనే కొనసాగుతామని కార్పొరేటర్ అభ్యర్థులతో కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రతిజ్ఞ చేయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నిక బండి సంజయ్ కు కీలకం

కరీంనగర్ నగర పరిధిలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఇది మరింత కీలకంగా మారింది. దీంతో ఆయన జోరుగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న బండి సంజయ్ స్ట్రీట్ కార్నర్ మీటింగులు, ఎన్నికల ప్రచార సభల్లో స్వయంగా బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

bandi sanjay election campaign reached peak bjp corporators vows in karimnagar municipal elections

ప్రతిజ్ఞ చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లు

పార్టీకి అంకిత భావంతో పని చేస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని అభ్యర్థులతో ప్రమాణం చేయిస్తున్నారు.. గెలిచిన తర్వాత పార్టీ మారబోమని, కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. పబ్లిక్ మీటింగ్స్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రజలకు బీజేపీ కార్పొరేటర్లు నిజాయితీగా సేవ చేస్తారని ఈ ప్రతిజ్ఞల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.

ఏమని ప్రతిజ్ఞ చేయించారంటే...

"...... అనే నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని, దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం పనిచేస్తానని, గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, పార్టీ కోసం నిజాయితీతో, నిబద్ధతతో, అంకిత భావంతో పని చేస్తానని దైవ సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

ప్రతిజ్ఞలపై బండి సంజయ్ ఏమన్నారంటే

ఈ ప్రతిజ్ఞల పర్వం నుద్దేశించి బండి సంజయ్ పార్టీ మారే రాజకీయాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రజలు నమ్మి ఓటు వేసిన తర్వాత పార్టీ మారడం ప్రజాద్రోహమేనని, బీజేపీలో అలాంటి సంస్కృతి ఉండదని అన్నారు. నిజాయితీగా తమ పార్టీ నేతలు పని చేస్తారని, కరీంనగర్ అభివృద్ధితో పాటు దేశం, సమాజం కోసం పనిచేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+