అంతర్మధనంలో బండి సంజయ్ .. నెక్స్ట్ ఏంటి?

బండి సంజయ్.. తెలంగాణ రాష్ట్ర బిజెపి రథసారధిగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడం కోసం సంచలన నిర్ణయాలతో దూకుడుగా ముందుకు సాగారు. అయితే అనూహ్యంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను పక్కనపెట్టి, ఆయన స్థానంలో కిషన్ రెడ్డి కి బీజేపీ అధిష్టానం పట్టం కట్టడం తో బండి సంజయ్ షాక్ కు గురయ్యారు.

ఇంతకాలం పార్టీ కోసం, వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం అహర్నిశలు కష్టపడితే, అద్భుతంగా పని చేసావ్ అని చెప్పిన అధిష్టానం, అకస్మాత్తుగా పక్కకు జరపడం పైన బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. బాగా పని చేసావ్ అని మెచ్చుకున్న అధిష్టానం చివరికి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బండి సంజయ్ కు డైజెస్ట్ కావడం లేదు. దీంతో ఆయన అంతర్మథనంలో పడ్డారు అని సమాచారం.

bandisanjay2

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన ఆవేదనలో ఉన్నారని తెలుస్తుంది. అగ్ర నేతలు తనను ప్రశంసిస్తూనే, తన పనితీరును మెచ్చుకుంటూనే తనను పక్కన పెట్టడం బండి సంజయ్ కు ఏమాత్రం రుచించడం లేదని సమాచారం.

కెసిఆర్ ని బలంగా ఢీ కొట్టాలని, వచ్చే ఎన్నికలలో కెసిఆర్ ను గద్దె దించాలని ఏ మాత్రం తగ్గకుండా పోరాటం చేసిన బండి సంజయ్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నారు. నిస్తేజంగా ఉన్న పార్టీకి ఉన్న పార్టీకి బండి సంజయ్ తన దూకుడుతో జోష్ తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా బిజెపిని బలంగా చూపించే ప్రయత్నం చేశారు.

bandisanjay

తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. సవాళ్లకు ప్రతిసవాళ్లు, విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ, కేసులను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగారు. అయినా ఆయనను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఎంతో కష్టపడి యాత్రలు చేసి ప్రజల దగ్గరకు బీజేపీని తీసుకెళ్ళే ప్రయత్నం చేసినా ఆయన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.

మాస్ లీడర్ గా ప్రజల బలాన్ని సంపాదించిన బండి సంజయ్ పార్టీలో ఉన్న విభేదాలను, వివాదాలను పరిష్కరించి ఒక్కటిగా పార్టీని నడిపించడంలో ఫెయిల్ అయ్యారని, చేరికలకు ఆయన దూకుడు ఆటంకంగా మారిందని అనేక రాజకీయ సమీకరణాలను బేరీజు వేసిన అధిష్టానం ఆయనని అధ్యక్షుడిగా తొలగించింది. అయితే ఈ విషయంలో బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తర్వాత ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+