బండి సంజయ్ కు జైలులో పెట్టిన ఆహారం!

bandi Sanjay areest: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఆయన్ని బుధవారం రాత్రి నుంచి కరీంనగర్ జైల్లోనే ఉంచిన పోలీసులు.. సంజయ్ కు సాధారణ ఖైదీలకు ఇచ్చే భోజనమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం సమయంలో ఇడ్లీ, మధ్యాహ్నం అన్నంతో పాటు పప్పు, టమోటా, రసం ఇచ్చారు.

తమ క్లైంట్ కిచ్చే ఆహారాన్ని ఎటువంటి తనిఖీలు చేయకుండా నేరుగా ఇచ్చారంటూ సంజయ్ న్యాయవాదులు అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఇవ్వాల్సిన ఆహారం విషయంలో కోర్టు నుంచి తమకు ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు రాలేని పోలీసులు చెబుతున్నారు. దీంతో అందరు ఖైదీల మాదిరిగానే ఆయనకూ సాధారణ భోజనం అందించారు. బండి సంజయ్ తరఫున అతని న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.

 bandi

హన్మకొండ కోర్టు ఇచ్చిన డాకెట్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, తక్షణమే సంజయ్‌ని విడుదల చేయాలని కోరుతూ ఆయన తరుఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ చేసే సమయంలో ఇవ్వాల్సిన 41-ఎ నోటీస్ కూడా ఇవ్వలేదని, ఆ సమయంలో పోలీసులు సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని కోర్టుకు తెలిపారు.

వేధింపులకు గురిచేయాలనే ఉద్దేశంతో కిలోమీటర్ల కొద్దీ తిప్పారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. వరంగల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని, రిమాండ్ రిపోర్టులో సైతం నేరం చేసినట్లు ఎక్కడా పొందుపరచలేదని తెలిపారు. కుట్రలో భాగంగానే ఈ కేసులో ఇరికించినట్లు అర్థమవుతోందని, అరెస్ట్ సమయంలో పోలీసులు crpc 50 నిబంధనలను పాటించలేదని పిటిషన్ లో ఆరోపించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+