సిట్ మీద నమ్మకం లేదు; నేను రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ!!

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్టే చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిట్ విచారణకు డుమ్మా కొట్టారు. అంతేకాదు సిట్ కు బండి సంజయ్ ఒక ఆసక్తికరమైన లేఖ రాశారు. తాను సిట్ ముందు హాజరు కాలేనని, తనకు అసలు సిట్ నోటీసులు అందలేదని పేర్కొన్న బండి సంజయ్, తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు ఇవ్వలేనని స్పష్టం చేశారు. సిట్ మీద తనకు నమ్మకం లేదని పేర్కొన్న బండి సంజయ్, తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ అధికారులకు ఇచ్చేది లేదన్నారు.

తాను మొదటినుంచి ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. తనకు నమ్మకం ఉన్న సంస్థల ముందే తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆ హక్కు తనకు ఉందని తెలిపారు. ప్రస్తుతం మీడియాలో వచ్చిన సమాచారం మేరకు తాను స్పందిస్తున్నానని పేర్కొన్న బండి సంజయ్, తనకు సిట్ పంపించిన నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యుడిగా తాను పార్లమెంటు సమావేశాలకు హాజరు కావలసి ఉందని పేర్కొన్న బండి సంజయ్, అయినప్పటికీ తను హాజరుకావాలని సిట్ అధికారులు భావిస్తే తనకు మరో తేదీ ఇవ్వాలని అప్పుడు వస్తానంటూ లేఖలో వెల్లడించారు.

Bandi Sanjay Letter to SIT that he has no faith in SIT!!

పార్లమెంటు సమావేశాలను దృష్టిలో పెట్టుకొని తనకు డేట్ కేటాయించాలని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్ వ్యూహాత్మకంగానే ఈరోజు సిట్ విచారణ కు డుమ్మా కొట్టారు. ఇక బండి సంజయ్ రాసిన లేఖతో సిట్ అధికారులు బండి సంజయ్ విచారణ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు? ఆయన విజ్ఞప్తి మేరకు మరో తేదీన నిర్ణయించి ఆయనకు చెబుతారా? అనేది తెలియాల్సి ఉంది.

Bandi Sanjay Letter to SIT that he has no faith in SIT!!

అంతకుముందు బండి సంజయ్ సిట్ అధికారులు తనకు నోటీసులు జారీ చేయడంపై నిప్పులు చెరిగారు. సిట్ అధికారులను లాజికల్ గా ప్రశ్నించిన బండి సంజయ్, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారంలో తన పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ కూడా ఆధారాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చే దమ్ము సిట్ కు ఉందా అంటూ ప్రశ్నించారు. సిట్ నోటీసుల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. అసలు కుట్రకు కారకులైన వారిని వదిలేసి విపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+