నాగార్జున సాగర్ పై బీజేపీ గురి .. ఉప ఎన్నికకు రెడీ.. భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకపక్క త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండడంతోపాటు, మరో పక్క రాష్ట్రంలో మరో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కొత్త పార్టీలు సైతం రంగం లోకి దిగుతున్న నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో నాగార్జునసాగర్ కు ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ నాగార్జునసాగర్ పై దృష్టి సారించాయి.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల గురి
అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికను టిఆర్ఎస్ పార్టీ తో సహా బిజెపి , కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాగార్జునసాగర్ ఉపఎన్నిక సన్నాహక సమావేశాన్ని హాలియా వేదికగా సీఎం కేసీఆర్ నిర్వహించారు. ఇప్పుడు అదే స్పీడ్ తో నాగార్జున సాగర్ లో బీజేపీ సైతం భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

నాగార్జున సాగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభ .. లంబాడీ ఓటు బ్యాంకు టార్గెట్
ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. నాగార్జున సాగర్ అభ్యర్థిని ఖరారు చేయలేదని పేర్కొన్న బండి సంజయ్, త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, సాగర్ ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్తున్నారు.
నాగార్జున సాగర్ లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బిజెపి జాతీయ నేతలు కూడా హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లంబాడి ఓటు బ్యాంకు పై కమలనాథులు ప్రత్యేకమైన దృష్టి సారించారని , ఉప ఎన్నికలకు ముందు లంబాడి కీలక నేత బిజెపిలో చేరనున్నారని తెలుస్తుంది.

మరోమారు గుర్రంపోడు వెళ్తామన్న బండి సంజయ్ .. సీఎం కేసీఆర్ కు సవాల్
నాగార్జున సాగర్ లో ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టిన బిజెపి ప్రతి 50 ఓటర్లకు ఒక బీజేపీ ప్రతినిధిని పెట్టినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు గుర్రంపోడు అరెస్టులను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరోమారు గుర్రంపోడు తండా వెళ్తానని అంతేకాదు పరేడ్ కూడా నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చిచెప్పారు. ఎంత మందిని అరెస్టు చేస్తారో అక్కడికి వచ్చి చేసుకోవాలని సవాల్ విసిరారు. సీఎం వస్తారో ఇంటిలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావు వస్తారో రావాలని ఎంత మందిని అరెస్ట్ చేసినా వెనుకడుగు వేసేది లేదని ఫైరయ్యారు బండి సంజయ్.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications