Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి. బండి సంజయ్ జోస్యం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెట్టి వ్యాఖ్యలకు కొనసాగింపుగా.. బీజేపీ రాష్ట్ర్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. పొత్తులపై బీజేపీ చెప్పిందే నిజమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వరంగల్ లో రాహుల్ గాంధీ చెప్పారని బండి గుర్తు చేశారు. కాని అధిష్టానం నిబంధనలను ధిక్కరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్, కాంగ్రెస్ భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ప్రజలను మోసం చేయడం కోసం కేసీఆర్ ఎన్నికల సమయం దగ్గర పడే వరకు కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా 60 సీట్లు గెలవలేదని.. హంగ్ తప్పదని జోస్యం చెప్పారు. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో కూడా వ్యతిరేకత వచ్చింది. వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications