Bandi Sanjay: తెలంగాణలో మహారాష్ట్ర ఫలితాలే వస్తాయి.. బండి సంజయ్..
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 221 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 55, ఇతరులు 12 చోట్ల ముందంజలో ఉన్నాయి. అయితే జార్ఖండ్ లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ ఇండియా కూటమి విజయం సాధించింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. మహారాష్ట్రలో ఇండియా కూటమికి పట్టిన గతే తెలంగాణలోనూ పడుతుందని అన్నారు.
బండి సంజయ్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. గతంలో కంటే ఎక్కవ సీట్లను తమ పార్టీ కైవసం చేసుకోబోతోందని తెలిపారు. మహారాష్ట్రలో మరోసారి నరేంత్ర మోదీ అభివృద్ధి మంత్రం పని చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వంపై ఇండియా కూటమి అసత్య ప్రచారం చేసినా.. ప్రజలు బీజేపీనే అదరించారని పేర్కొన్నారు. హస్తం పార్టీ ఓ ఐరన్ లెగ్ పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా మునుగుడు ఖాయమేనని ఎద్దేవా చేశారు. హిందూ ఐడీయాలజీ ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన 'ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే పార్టీ హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే పార్టీలతో కుమ్మక్కు అయిందని పేర్కొన్నాడు.

అందుకే ఆ పార్టీ ఘోర పరాభవం చవిచూసిందని వివరించారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కనిపించిందని గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందని బండి గుర్తు చేసింది. మహారాష్ట్ర విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.ఎన్డీఏ కూటమి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించింది. అయితే వయనాడ్ లో మాత్రం ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది.
Maharashtra results are a testament to Hindu Unity and trust in @BJP4India & Hon’ble PM Shri @narendramodi ji’s leadership. pic.twitter.com/1w9EZfYzBe
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 23, 2024
వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ రికార్డు మెజారిటీతో విజయం సాధించనున్నారు. ప్రస్తుతం ఆమె 3 లక్షల 68 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీకి 3 లక్షల 64 వేల మెజారిటీ వచ్చింది.













Click it and Unblock the Notifications