టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్పు.. పందికి లిప్ స్టిక్ పెట్టటమే: బండిసంజయ్ షాకింగ్ ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ గా మారుస్తూ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నట్లు దసరా నాడు ప్రకటించారు. దేశ రాజకీయాలలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి, తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశవ్యాప్తంగా అమలుపరచడానికి కెసిఆర్ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణా మంత్రులు అలా.. బీజేపీ ఇలా
ఇక కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో దేశంలో కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది నాంది అని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని టిఆర్ఎస్ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సంచలనం సృష్టించటం ఖాయం అని చెప్తున్నారు. ఇక తెలంగాణాలోని ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటును టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బిజెపి కెసిఆర్ ను, తెలంగాణ మంత్రులను టార్గెట్ చేసి సెటైర్లు వేస్తుంది.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చటం పందికి లిప్ స్టిక్ పెట్టటమే: బండి సంజయ్
తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ పార్టీని బి ఆర్ ఎస్ గా మార్చడం పందికి లిప్ స్టిక్ పెట్టడమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంటే టిఆర్ఎస్ పేరును మార్చినంత మాత్రాన ఏమీ మారదని, పందికి లిప్ స్టిక్ పెట్టినంత మాత్రాన ప్రయోజనం ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు.

ట్విట్టర్ టిల్లూ అంటూ కేటీఆర్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్
అంతేకాదు మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ కేటీఆర్ ట్విట్టర్ టిల్లు తాము గేమ్ చేంజర్స్ అని చెప్పుకుంటున్నారని, కేసీఆర్ మాత్రం నేమ్ చేంజర్ గా మారిపోయాడని, ఇక ప్రజలు అంతిమంగా ఫేట్ చేంజర్స్ అవుతారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. కచ్చితంగా ప్రజలు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని బండి సంజయ్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బొంద పెట్టినట్టే : వివేక్ వెంకటస్వామి
ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో కెసిఆర్ ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఇక దేశంలో కేసీఆర్ ను ఎవరు నమ్ముతారు అంటూ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ ఖేల్ ఖతం అయిందని పేర్కొన్న మాజీ ఎంపీ వివేక్ బీఆర్ఎస్ పార్టీ పేరుతో, టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బొంద పెట్టారని పేర్కొన్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications