Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తుఫాన్ మొదలైంది: బాబోయ్.. బండ్ల గణేశ్ మళ్ళీ మొదలెట్టాడు!!

బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని వ్యక్తి. సినీ నిర్మాతగా బండ్ల గణేష్ గురించి అందరికీ తెలుసు. అటువంటి బండ్లగణేష్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి నానా హంగామా చేశారు. ఆపై నాకీ రాజకీయాలు వద్దు మహాప్రభో అంటూ రాజకీయాల నుండి పక్కకు జరిగారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ గెలవకుంటే 7'o' క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

రాజకీయాలలో సైలెంట్ గా ఉంటున్న ఆయన ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ను పొగుడుతూ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకున్న వేళ సంచలన పోస్టులు పెట్టారు బండ్ల గణేష్. ఇక ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సంచలన ట్వీట్ లు చేస్తున్నారు. దీంతో బండ్ల గణేష్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ అవుతున్నారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

bandla ganesh sensational comments on congress party and bhatti vikramarka

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సినీ నటుడు నిర్మాత అయిన బండ్లగణేష్ పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ని కలుస్తానని అన్న వస్తున్నా అంటూ ట్వీట్ చేసిన బండ్ల గణేష్, ఆపై భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిసి ఆయన చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో తుఫాన్ వస్తుందని, ఇప్పటికే కర్ణాటక నుంచి అది స్టార్ట్ అయిందని, తర్వాత తెలంగాణను కొట్టుకొని, ఢిల్లీ దాకా వెళుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఢిల్లీలోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. మరో 150 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని బండ్లగణేష్ పేర్కొన్నారు.

తాము గొప్పలు చెప్పుకో మని, డబ్బాలు కొట్టుకోమని , ప్రకటనలు ఇవ్వమని, సినిమాలు తీయమని పేర్కొన్న బండ్లగణేష్ ప్రజాసేవ చేస్తాం అన్నారు. తక్కువ మాట్లాడతాం.. ఎక్కువ పని చేస్తామంటూ వెల్లడించారు. ఎక్కువ మాట్లాడి తక్కువ పనిచేస్తున్న వారి పరిపాలన ఇక్కడ చూస్తున్నారంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భట్టి విక్రమార్క వంటి నాయకుడికి మద్దతు తెలపడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న బండ్లగణేష్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తామంతా కలిసి పోరాటం చేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి ప్రజలందరి సహాయసహకారాలు కావాలని పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బండ్ల గణేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+