• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమైక్య పాలకులను మించి అవినీతి.!కేసీఆర్ పాలనపై ప్రజలు తిరగబడాలన్న బండి సంజయ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మించి చంద్రశేఖర్ రావు పాలనలోనే అవినీతి రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ రావు కుటుంబ అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఆదరిస్తున్నారని, ఇటీవల ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన ఆదరణే అందుకు నిదర్శనమన్నారు. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజా క్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

 కుటుంబ, అవినీతి పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు.. కేసీఆర్ విధానాలను ఎండగట్టాలన్న బండి సంజయ్

కుటుంబ, అవినీతి పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు.. కేసీఆర్ విధానాలను ఎండగట్టాలన్న బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుదవారం జరిగిన శిక్షకుల శిక్షణా సమావేశ ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వర్చువల్ పద్దతిలో జరిగిన ఈ సమావేశంలో ఓబీసీ జాతీయ మెర్చా అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ది చెబుతారనడానికి దేశ చరిత్రతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని అనేక సంఘటనలే ఇందుకు నిదర్శనమని బండి సంజయ్ స్పష్టం చేసారు.

 గులాబీ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం.. రాబోయేది బీజేపి ప్రభుత్వమన్న సంజయ్..

గులాబీ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం.. రాబోయేది బీజేపి ప్రభుత్వమన్న సంజయ్..

నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని బండి సంజయ్ తెలిపారు. నాడు సమైక్య రాష్ట్రంలోనూ అవినీతి కొనసాగిందని, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయారని బండి సంజయ్ తెలిపారు. గత్యంతరం లేక ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఫలితంగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని బండి సంజయ్ గుర్తు చేసారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగానే ఆనాడు టీడీపీని ప్రజలు ఆదరించారని బండి సంజయ్ అన్నారు.

 కేసీఆర్ ఇచ్చిన హామీలపై పోరాటం.. ప్రజాక్షేత్రంలో నిలదీయాలన్న బీజేపి ఛీఫ్

కేసీఆర్ ఇచ్చిన హామీలపై పోరాటం.. ప్రజాక్షేత్రంలో నిలదీయాలన్న బీజేపి ఛీఫ్

తెలంగాణలో చంద్రశేఖర్ రావు హయాంలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోందని, చంద్రశేఖర్ రావు కుటుంబ అవినీతి, నియంత పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, ప్రజలు ఈ పాలనకు చరమ గీతం పాడాలని భావిస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేసారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారని, అవినీతి, నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర'కు ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన ఇందుకు నిదర్శనమని సంజయ్ పేర్కొన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్రం అభివ్రుద్ది జరుగుతుందనే భావనలో ప్రజలు ఉన్నారని సంజయ్ ఉద్ఘాటించారు.

  Telangana : జాతీయ రాజకీయాల్లో CM KCR అడుగులు.. Mamata Banerjee తో భేటీ! || Oneindia Telugu
   రాష్ట్ర శిక్షకుల శిక్షణా సమావేశంలో బండి సంజయ్.. కేసీఆర్ కుటుంబ పాలన ఎండగట్టాలని సంజయ్ పిలుపు

  రాష్ట్ర శిక్షకుల శిక్షణా సమావేశంలో బండి సంజయ్.. కేసీఆర్ కుటుంబ పాలన ఎండగట్టాలని సంజయ్ పిలుపు

  అవినీతి, కుటుంబ పాలనను బీజేపీ ఎన్నటికీ సహించదని, అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నయ పార్టీగా చూస్తున్నారని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి హామీలిచ్చిందో అధ్యయనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ ను ఎండగట్టాలని సంజయ్ పిలుపునిచ్చారు. దేశ రాజకీయ, ఆర్దిక, సామాజిక అంశాలపట్ల ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అవగాహన కల్పించి ప్రజా క్షేత్రంలో పనిచేయడానికి అవసరమైన ఆయుధాలను ఈ శిక్షణా తరగతుల ద్వారా అందిస్తున్నామని, శిక్షణ పొందిన కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి విజయం తథ్యమని, ఈ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త సుశిక్షుతుడై పార్టీని విజయ తీరాలకు చేర్చే దిశగా ముందుకు సాగాలని బండి సంజయ్ తెలిపారు.

  English summary
  BJP state president and MP Bandi Sanjay Kumar has flagged that corruption is rampant in the Chandrasekhar Rao regime beyond the joint Andhra Pradesh. Chandrasekhar Rao said people were fed up with family corruption and dictatorship.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X