అవసరం లేదు: డిజిటల్ చెల్లింపులు చేసేవారికి కేంద్రం తీపికబురు

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పెట్రో పంపు యజమానులకు, వాహనదారులకు శుభవార్త చెప్పారు. పెట్రోల్ బంకుల్లో ఏటీఎం కార్డుల ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి ఆయన తీపి కబురు అందించారు.

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పెట్రో పంపు యజమానులకు, వాహనదారులకు శుభవార్త చెప్పారు. పెట్రోల్ బంకుల్లో ఏటీఎం కార్డుల ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి ఆయన తీపి కబురు అందించారు.

క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసేవారిపై ఛార్జీల భారం ఉండదని ఆయన గురువారం చెప్పారు.

dharmendra pradhan

పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసేందుకు కార్డులను ఉపయోగించేవారిపై ఛార్జీల భారం ఉండదని, లావాదేవీల ఛార్జీలను బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లు భరిస్తాయన్నారు. ఈ నిర్ణయం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు.

మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)తో వినియోగదారులను ఇబ్బంది పెట్టమని చెప్పారు. రిటైల్ ఔట్‌లెట్లు (పెట్రోలు పంపులు)ను కూడా దీని పరిధి నుంచి బయటే ఉంచుతామన్నారు. లావాదేవీల ఛార్జీలను ఏవిధంగా పంపిణీ చేసుకోవాలో బ్యాంకులు, ఓఎంసీలు నిర్ణయించుకుంటాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+