వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళి తర్వాత బతుకమ్మ; అక్కడ ఆడా, మగా తేడా లేకుండా బతుకమ్మ సంబరాలు.. ప్రత్యేకతలివే!!

|
Google Oneindia TeluguNews

అందరూ దసరాకి ముందు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం దీపావళి పండుగ తరువాత బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు చేసి, చివరి రోజున ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బతుకమ్మ సంబరాలలో పాల్గొంటారు. ఇక ఈ బతుకమ్మ విశేషాలేంటి? మూడు రోజుల పాటు ఉత్సవాలలో ఏం చేస్తారు? ఎందుకు దీపావళి పండుగ తర్వాత వీరు బతుకమ్మను చేసుకుంటారు తెలుసుకోవాలంటే వన్ఇండియా అందించే ప్రత్యేకమైన కథనం మీకోసం.

హన్మకొండ జిల్లా సీతంపేటలో బతుకమ్మ వేడుకలు రేపటి నుండి

హన్మకొండ జిల్లా సీతంపేటలో బతుకమ్మ వేడుకలు రేపటి నుండి

హన్మకొండ జిల్లాలోని సీతంపేటలో దీపావళి పండుగ సందర్భంగా బతుకమ్మ సంబరాలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. సహజంగా ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత రోజున బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. కానీ ఈ సంవత్సరం దీపావళి తర్వాత రోజు సూర్య గ్రహణం రావడంతో, మూడు రోజులపాటు జరుపుకోవాల్సిన బతుకమ్మ పండుగను రెండు రోజులపాటు నిర్వహించుకునేలా కుదించారు. అక్టోబర్ 27వ తేదీన బుధవారం నాడు, 27 గురువారం నాడు రెండు రోజులపాటు సీతంపేట బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు.

నేతగాని కులస్థుల బతుకమ్మ సందడి

నేతగాని కులస్థుల బతుకమ్మ సందడి

రాష్ట్రంలో అందరూ ప్రతి సంవత్సరం భాద్రపద, ఆశ్వయుజ మాసాల మధ్య తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆత్మగౌరవ పతాకను బతుకమ్మ పండుగను జరుపుకుంటే, సీతంపేట వాసులు మాత్రం దీపావళికి బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితి. అందుకు కారణం లేకపోలేదు సీతంపేట గ్రామంలోని నేతగాని కులస్తులు దాదాపు రెండు వందల సంవత్సరాల నుండి దీపావళి పండుగ తర్వాత బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. నేతగాని కులానికి చెందిన వారు నిర్వహించే ఈ బతుకమ్మ సంబరాలలో, మహిళలే కాదు పురుషులు కూడా బతుకమ్మలను ఎత్తుకొని సందడి చేస్తారు.

నేతగాని కులస్థుల బతుకమ్మ సంబరాల వెనుక రీజన్ ఇదే

నేతగాని కులస్థుల బతుకమ్మ సంబరాల వెనుక రీజన్ ఇదే

ఇక నేతకాని కులస్తులకు ఈ ఆచారాన్ని కొనసాగించడం వెనుక ఒక కారణం ఉందని చెబుతున్నారు. గతంలో అందరు గ్రామస్థులతో పాటు బతుకమ్మ ఆడేందుకు నేతకాని కులస్తులు వెళితే వారితో ఆడడానికి గ్రామస్తులు నిరాకరించేవారట. దీంతో వారు ప్రత్యేకంగా బతుకమ్మను చేసుకోవాలని నిర్ణయించుకుని దీపావళి తర్వాత బతుకమ్మ సంబరాలకు మూడు రోజులు కేటాయించాలని నిర్ణయించారట. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు నేతకాని కులస్తులు ప్రతి సంవత్సరం దీపావళి పండుగ తర్వాత బతుకమ్మ ఉత్సవాలను సాగిస్తున్నారు.

రేగడి మట్టితో జోడెద్దుల బొమ్మలు తయారు చేసి ప్రత్యేక పూజలు

రేగడి మట్టితో జోడెద్దుల బొమ్మలు తయారు చేసి ప్రత్యేక పూజలు

ఇక రేపటి నుంచి జరగనున్న నేతగాని బతుకమ్మ సంబరాలలో రేపు ఉదయం కేదారేశ్వర స్వామి వ్రతకల్పం, ఆపై చెరువు దగ్గర రేగడి మట్టితో జోడెద్దుల బొమ్మలు తయారుచేయడం చేస్తారు. ఇక జోడెద్దులు బొమ్మలను ఇంట్లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఆ పై సాయంత్రం మగవారు భారీ ప్రదర్శనగా వెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం చెరువు నుండి జలాన్ని తీసుకువచ్చి ప్రత్యేక గదిలో పెట్టి పూజలు నిర్వహిస్తారు.

బతుకమ్మ సంబరాలలో మహిళలతో పాటు పురుషులు

బతుకమ్మ సంబరాలలో మహిళలతో పాటు పురుషులు

ఆపై గురువారంనాడు మహిళలు బతుకమ్మను తయారు చేసి పూజిస్తారు. సాయంత్రం వేళ భారీ ఊరేగింపుగా స్త్రీ, పురుషులందరూ బతుకమ్మలతో చెరువు వద్దకు వెళతారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు బతుకమ్మ లను ఎత్తుకొని ప్రదర్శనగా వెళ్తారు. యువకుల కోలాటాలు, ఆటపాటల నడుమ చెరువు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఇక ఎంతో సందడిగా సాగనున్న నేతకాని కులస్తుల బతుకమ్మ వేడుకలను చూడడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది వస్తారు.

సూర్యగ్రహణం ఎఫెక్ట్: 12గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత, దర్శనాలు అప్పటినుండే!!సూర్యగ్రహణం ఎఫెక్ట్: 12గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత, దర్శనాలు అప్పటినుండే!!

English summary
Bathukamma celebrations are held after Diwali in Sithampet of Hanmakonda district. Bathukamma celebrations, which are celebrated by both male and female, will continue tomorrow and tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X