నేడు, రేపు భారీ నుండి అతిభారీ వర్షాల హెచ్చరిక పంపిన బంగాళాఖాతం!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణాలో భారీ నుండి అతి భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Bay of Bengal issues warning of heavy to very heavy rains today and tomorrow

నేడు, రేపు హైదరాబాద్ లో వర్షాలు.. అలెర్ట్
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో భారీవర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు, రేపు కురిసే వర్షాల నేపథ్యంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం హైదరాబాదులోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాలలో రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడ్డారు.

ఇంకా మూడు రోజులు వర్షాలే
నేడు కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో నేడు అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఎల్లో అలెర్ట్ ను కూడా జారీ చేసింది. అంతేకాదు మరోవైపు మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది . నిన్న ములుగు జిల్లా మల్లంపల్లి లో 21.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కరీంనగర్ జిల్లా ఇందుర్తి లో 21.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ప్రజలు అలెర్ట్ గా ఉండాలి
మెదక్ లో 19.8 సెంటీమీటర్ల వర్షపాతం, కరీంనగర్ జిల్లా బోర్న పల్లి లో 18 సెంటీమీటర్ల వర్షపాతం, సిద్దిపేట జిల్లా గండేపల్లి లో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్న నేపధ్యంలో వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+