ఏపీ, తెలంగాణాను బెదిరిస్తున్న బంగాళాఖాతం.. వర్షాలు ఎప్పటివరకంటే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గత కొద్దిరోజులుగా వాతావరణం మారిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించిన నేపథ్యంలో గత కొద్దిరోజులుగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక ప్రాంతాలలో చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి.
ఏపీలో వర్షాలు.. ఈ జిల్లాలలోనే
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం,విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అల్లూరి,విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,పల్నాడు, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలంగాణాలోనూ ఐదురోజులపాటు వర్షాలు
తెలంగాణలో మరో ఐదురోజులపాటు పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం హెచ్చరికలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి ,మేడ్చల్, మెదక్, కామారెడ్డి ,హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి ,నారాయణపేట, గద్వాల జిల్లాలో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
రేపు ఈ జిల్లాలలో వర్షాలు
తెలంగాణా వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన 40నుండి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లోఅలెర్ట్ ను జారీ చేసింది. రేపు సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.
ఎల్లుండి ఈ జిల్లాలలో వర్షాలు
ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications