బిసి కమీషన్ సభ్యుల పదవీస్వీకారం : హాజరైన మంత్రులు
హైదరామాద్ :బిసి ల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం బిసి కమీషన్ ను ఏర్పాటు చేసింది. బిఎస్ రాములు చైర్మెన్ గా కమీషన్ ఏర్పాటైంది. ఈ కమీషన్ చైర్మెన్ తో పాటు సభ్యులు గురువారం నాడు రవీంద్రబారతిలో పదవీ భాద్యతలు చేపట్టారు.
రాష్ట్రంలో బిసి జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం బిఎస్ రాములు నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి బిసి ల స్థితిగతులపై అద్యయనం చేయనుంది.

బిఎస్ రాములు తో సహా కమీషన్ సభ్యులు ఇవాళ రవీంద్రబారతి లో పదవిభాద్యతలు చేపట్టారు.రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్ ,జోగురామన్న తో పాటు శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ తదితరులు బిసి కమీషన్ సభ్యులను అభినందించారు.
బిసి ల సామాజిక స్థితిగతులను అద్యయనం చేసేందుకు ప్రభుత్వం కమీషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రులు ఈటల రాజేందర్, జోగురామన్నలు.రాష్ట్ర జనాభాలో 50 శాతంగా ఉన్న బిసిల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు.












Click it and Unblock the Notifications