సండ్ర కాల్స్ డేటా పరిశీలన పూర్తి, 'రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సెల్‌ఫోన్ కాల్ డేటా పరిశీలన ఎఫ్ఎస్ఎల్‌లో పూర్తయిందని సమాచారం. ఎసిబి అధికారులు ఫోన్ సంభాషణ ట్రాన్స్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేయించి వాటి ప్రతులను ఇటీవలె ఎస్ఎఫ్ఎల్‌కు అప్పగించింది.
ఎస్ఎఫ్ఎల్ వాటిని పరిశీలించినట్లుగా సమాచారం. మరో రెండు రోజుల్లో ట్రాన్స్ స్క్రిప్ట్ ప్రతులను ఎసిబి అధికారులకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఎసిబి ఓటుకు నోటు కేసులో దూకుడు పెంచనున్నారు. ఓటుకు నోటు కేసులో సండ్ర ఐదో నిందితుడిగా ఉన్నారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారనే కోణంలో దర్యాఫ్తు చేయనున్నారు.

బ్లాక్‌మెయిల్ రేవంత్ రెడ్డి నైజం
సమాచార హక్కు చట్టం కింద సమాచారం సేకరించడం, బ్లాక్‌మెయిల్, దందాలు చేయడం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంస్కృతి అని తెలంగాణ బీసీ జేఏసీ మండిపడింది. బీసీ ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక తెగకోస్తామని హెచ్చరించింది.
ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ బాలరాజు మాట్లాడారు.
రాజస్థాన్‌లోని రుడాలి జాతికి చెందిన వారు ఉన్నతవర్గాలవారు ఎవరైనా చనిపోతే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఏడుస్తారని, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆంధ్రా సీఎం చంద్రబాబు దగ్గర డబ్బు సంచులు తీసుకుని తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై అనవసర ఆరోపణలు చేస్తూ, ఆంధ్రా రుడాలి జాతి వ్యక్తిగా మారాడని విమర్శించారు.
రేవంత్ రెడ్డి తక్షణమే ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీల చేతిలో చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications