వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యూటీషియన్ శిరీష కేసు క్లోజ్ అయినట్లేనా?: కాల్ గర్ల్స్‌ని పంపిన శ్రవణ్

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు పాల్పడిన కేసులో విచారణ ముగిసిందా? అంటే అవుననే అంటున్నారు. ఫోరెన్సిక్ నివేదికలో శిరీషపై అత్యాచారం జరిగిందని తేలితే తప్ప ఈ కేసు ఫైల్‌ను పోలీసులు మూసేసినట్లే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు పాల్పడిన కేసులో విచారణ ముగిసిందా? అంటే అవుననే అంటున్నారు. ఫోరెన్సిక్ నివేదికలో శిరీషపై అత్యాచారం జరిగిందని తేలితే తప్ప ఈ కేసు ఫైల్‌ను పోలీసులు మూసేసినట్లే అంటున్నారు.

<strong>శిరీష-రాజీవ్ భార్యాభర్తలని..: షాకైన తేజస్విని</strong>శిరీష-రాజీవ్ భార్యాభర్తలని..: షాకైన తేజస్విని

పోలీసుల నుంచి సమాధానం వినిపిస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలో శిరీషపై అత్యాచారం జరిగిందని తేలితే తప్ప ఈ కేసు ఫైల్‌ను పోలీసులు మూసేసినట్టేనని అంటున్నారు. కోర్టులో విచారణ సమయంలో పోలీసులు దర్యాప్తు వివరాలు జడ్జికి నివేదిస్తారు.

రీ కన్‌స్ట్రక్షన్ పేరుతో..

రీ కన్‌స్ట్రక్షన్ పేరుతో..

ఇప్పటికే ఈ కేసులో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. రాజీవ్, శ్రవణ్ ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు, విచారణను తూతూ మంత్రంగా ముగించారని శిరీష పిన్ని ఇప్పటికే ఆరోపించారు. కేసు రీ కన్‌స్ట్రక్షన్ పేరుతో కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తిప్పిన పోలీసులు కనీసం క్వార్టర్స్ వరకు కూడా వెళ్లలేదంటే కేసుపై ఎంత శ్రద్ధచూపించారో తెలుసుకోవచ్చన్నారు.

ఫైల్ క్లోజ్ చేసేనా..

ఫైల్ క్లోజ్ చేసేనా..

ఈ కేసులో తమ అనుమానాలేవీ తీరలేదు సరికదా, మరింత బలపడ్డాయని శిరీష పిన్ని అన్నారు, ఫోరెన్సిక్ నివేదిక ఎలా వస్తుందో చూడాలని, అంతవరకు పోలీసులు చెబుతున్నదే వినాల్సి ఉంటుందన్నారు. మరోవైపు రెండు రోజుల కస్టడీ ముగిసిన అనంతరం రాజీవ్, శ్రవణ్‌లకు వైద్యపరీక్షలు నిర్వహించి, నాంపల్లి కోర్టులో సరెండర్ చేశారు. దీంతో ఈ కేసు ఫైల్ ఇంచుమించు క్లోజ్ అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శిరీషను చంపాల్సిన అవసరం లేదని..

శిరీషను చంపాల్సిన అవసరం లేదని..

శిరీషను చంపాల్సిన అవసరం తనకు లేదని నిందితుడు రాజీవ్‌ విచారణలో చెప్పాడని తెలుస్తోంది. శిరీషను, తేజస్వినిని వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే ఎస్‌ఐ ద్వారా సెటిల్‌మెంట్‌కు సిద్ధమయ్యానని, తర్వాత పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడదామని అనుకున్నానని చెప్పాడని సమాచారం. కూకునూర్‌పల్లి నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణంలో శిరీష ఏడుస్తూ బిగ్గరగా కేకలు వేయడం, కారులో నుంచి దూకేందుకు ప్రయత్నించటంతో ఆమె నోరు మూయించేందుకు చేయి చేసుకున్నట్లు రాజీవ్‌ వెల్లడించాడు. ఈ క్రమంలో కారు సీటుకేసి కొట్టడంతో ఆమె ముఖానికి గాయాలైనట్లు పోలీసులకు వివరించాడు. తాము షేక్‌పేట్‌ చేరేలోపు ఎస్సై మూడుసార్లు ఫోన్‌చేసి ఆరా తీసినట్లు తెలిపాడు. వీడియోకాల్‌ చేసిన సమయంలో తాను ఫోన్లో మాట్లాడి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని కూడా చెప్పాడని తెలుస్తోంది. కేసులో ఇరుక్కుంటాననే భయంతోనే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామని చెప్పాడని తెలుస్తోంది.

రెండుసార్లు కాల్ గర్ల్స్‌ని పంపించా..

రెండుసార్లు కాల్ గర్ల్స్‌ని పంపించా..

తనకు ఉన్న పాతపరిచయంతోనే కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ద్వారా రాజీవ్‌ వివాదం పరిష్కరించేందుకు శ్రవణ్‌ ప్లాన్‌ వేశాడు. దీనిలో భాగంగానే అనేకసార్లు ఎస్సైతో అతడు మాట్లాడాడు. అప్పటికే కుటుంబ వివాదాలు, భూతగాదాలతో రెండుసార్లు ఎస్సైని కలవటంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్‌ నుంచి రెండుసార్లు కాల్‌గర్ల్స్‌ను కూడా కూకునూర్‌పల్లి పంపినట్లు శ్రవణ్‌ పోలీసుల ఎదుట అంగీకరించాడని తెలుస్తోంది.

English summary
Rajiv, Sravan two days custody completed in Beautician Sirisha’s case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X