• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ విషయం తెలిసే: రేవంత్ అసంతృప్తికి ఇదీ కారణం! బాబు పేరుతో దిమ్మతిరిగే షాక్

By Srinivas
|

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత చర్చకు దారి తీశాయి. పార్టీలోకి ఇటీవలే వచ్చి, అప్పుడే పదవులు ఇవ్వలేదని చెప్పడమే కాకుండా, తనకు ఏ పదవి ఇవ్వాలో కూడా చెప్పడం ఇతర కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట.

చదవండి: ఆ పదవి వద్దు, నాకు ఎన్నో హామీలిచ్చారు, నా మాట వింటే సరే.. నేనే సీఎం: కాంగ్రెస్‌పై రేవంత్ సంచలనం

రేవంత్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన లక్ష్యం ముఖ్యమంత్రి పదవేనని, ఏ పదవి పడితే ఆ పదవి తీసుకోనని, తాను లీడర్‌ను అని, అవసరమైతే కార్యకర్తలా పని చేస్తానని మాట్లాడారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో తనకు ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇవ్వాలని అంటున్నారు.

చదవండి: ఓటుకు నోటు కేసు, ఇదీ అసలు విషయం!: 'చంద్రబాబును ఎవరూ ఏం చేయలేరు'

ఆ విషయం తెలిసి రేవంత్ అసంతృప్తికి కారణం

ఆ విషయం తెలిసి రేవంత్ అసంతృప్తికి కారణం

మరోవైపు, పార్టీలో చేరిన సమయంలో తనకు ఇచ్చిన హామీ, తనతో పాటు చేరిన కీలక నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి, అసంతృప్తి బయట పెట్టడానికి కారణమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో త్వరలో పదవుల పంపకం జరగనుంది. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలు తనకు తెలియడంతో అసంతృప్తిని ముందే బయటపెట్టారని అంటున్నారు.

ఆ విషయం తెలిసి అసంతృప్తి

ఆ విషయం తెలిసి అసంతృప్తి

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ బాధ్యతలు హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ప్రచార కమిటీ బాధ్యతలు వి హనుమంత రావు, పొన్నం ప్రభాకర్ వంటి నేతలకు కేటాయించనున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి రేవంత్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారని అంటున్నారు.

చంద్రబాబు పేరుతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్

చంద్రబాబు పేరుతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్

ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు ప్రచార కమిటీ బాధ్యతలు కూడా గట్టిగా కోరుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే రోడ్ల మీద పరుగెత్తగలిగే తనను తెర వెనుక కూర్చోమంటే ఎలాగని ప్రశ్నించారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తన పనితీరు చూసి కీలక బాధ్యతలు అప్పగించారని, అక్కడ ఓ స్థాయికి ఎదిగిన తర్వాతనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఇక్కడ మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే షాకిచ్చారు.

తనతో వచ్చిన వారికీ ప్రాధాన్యత లేక, సీఎం హింట్ కూడా

తనతో వచ్చిన వారికీ ప్రాధాన్యత లేక, సీఎం హింట్ కూడా

విహెచ్ వంటి సీనియర్లకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించి, రేవంత్‌కుకో చైర్మన్ బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం సాగుతోంది. తనకు ప్రాధాన్యత లేకపోవడంతో పాటు తనతో వచ్చిన వారికి కూడా పార్టీలో ప్రాముఖ్యత లేకపోవడం కూడా ఆయనకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. రేవంత్ ప్రచార కమిటీ బాధ్యతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోరుకుంటున్నారని మాటల ద్వారా అర్థమవుతోంది. అంతేకాదు, 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు ఇస్తే సీఎం పదవి ఇవ్వాలని లేదంటే సామాన్య కార్యకర్తలా ఉంటానని ఓ విధంగా సూటిగా చెప్పారు.

రాహుల్‌ను కలిసేందుకు ప్రయత్నం, పెద్దలకు ఫిర్యాదు

రాహుల్‌ను కలిసేందుకు ప్రయత్నం, పెద్దలకు ఫిర్యాదు

పార్టీలో తనకు, తనతో పాటు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాహుల్ గాంధీకి చెప్పేందుకు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రయత్నించారని తెలుస్తోంది. కానీ రాహుల్ బీజీ షెడ్యూల్ కారణంగా అపాయింటుమెంట్ దొరకడం ఇబ్బందికరంగా మారింది. త్వరలో కర్నాటక ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో ఆయనను కలిసేందుకు ప్రయత్నించనున్నారని తెలుస్తోంది. మరోవైపు, రేవంత్ రెడ్డి తీరుపై ఇప్పటికే కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలతో ఉత్తమ్ కూడా నొచ్చుకున్నారట. అప్పుడే పార్టీలోకి వచ్చిన రేవంత్ కొంతకాలం వేచి చూడాలని కూడా అంటున్న వారు లేకపోలేదు. ఏదైనా ఉంటే పార్టీ లోపల చర్చించుకోవాలని, ఇలా బయటకు రావడం సరికాదంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ నెక్స్ట్ స్టెప్ ఏమిటనే చర్చ సాగుతోంది. సాధారణంగా ఆయన దూకుడుగా ఉంటారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని ponguleti sudhakar reddy వార్తలుView All

English summary
Congress Party leader and Kodangal MLA Revanth Reddy is unhappy with State Congress Leader. He may meet Rahul Gandhi soon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more