వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో జోరుగా బెట్టింగ్, వెయ్యికి రూ.2 వేలు.. లక్షకు 2 లక్షలు

|
Google Oneindia TeluguNews

మరికొద్దీ గంటల్లో మునుగోడు బై పోల్.. ఓటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. బీరు, బిర్యానీ కాక.. నగదు ప్రవాహాం పారుతోంది. ఈసీ ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. మనీ సర్క్యులేట్ జరుగుతూనే ఉంది. ఇటు బెట్టింగ్ కూడా జోరుగా నడుస్తోంది. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులపైనే బెట్ చేస్తున్నారని తెలిసింది.

వెయ్యికి రూ.2 వేలు

వెయ్యికి రూ.2 వేలు

వెయ్యికి రూ.2 వేలు.. లక్షకు రెండు లక్షలు అంటూ బెట్టింగ్ జరుగుతుంది. హైదరాబాద్ హోటళ్లలో బెట్టింగ్ రాయుళ్లు ఉండి.. వ్యవహారం నడిపిస్తున్నారు. కొందరు ఏజెంట్స్ పెట్టుకొని బెట్టింగ్ చేస్తున్నారట. కొందరు నచ్చిన పార్టీ.. మరికొందరు అభ్యర్థులను పెట్టుకుంటున్నారు. అడ్వాన్స్ రూపంలో కూడా భారీగా చెల్లింపులు జరుగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ తరహాలో బెట్టింగ్ నడుస్తోంది.

ఇలా బెట్టింగ్

ఇలా బెట్టింగ్

ఏ పార్టీ గెలుస్తోంది.. ఎంత పోలింగ్ పర్సంటేజ్.. ఏ రౌండ్‌లో ఎవరికీ ఎక్కువగా ఓట్లు వస్తాయనే కోణంలో బెట్టింగ్ కాస్తున్నారు. మెజార్టీ ఎంత.. డిపాజిట్ దక్కేదెవరికీ, డిపాజిట్ కోల్పోయేవారు ఎవరనే కోణంలో కూడా బెట్టింగ్ జరుగుతుంది. వీరిపై పోలీసులు నిఘా వేసి.. రంగంలోకి దిగినట్టు తెలిసింది. అయినప్పటికీ కోట్లలో డబ్బులు చేతులు మారనున్నాయి. కొందరు సిక్రెట్‌గా బెట్టింగ్ చేస్తున్నారు. యాప్ కాకుండా.. వన్ టు వన్ కూడా చేస్తున్నారట.

వీరి మధ్యే బెట్టింగ్

వీరి మధ్యే బెట్టింగ్

మునుగోడులో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నేతలు ప్రచారం కూడా బానే చేస్తున్నారు. కానీ ఓటరు నాడీ మాత్రం రాజగోపాల్ రెడ్డి వైపే మొగ్గు చూపుతుంది. అధికార పార్టీ మాత్రం.. సంక్షేమ పథకాలు అని చెబుతుంది. కానీ ఎవరు గెలిచారు.. నిలిచారు అని తేలేది మాత్రం ఆరో తేదీన.. ఆ రోజునే ఫలితం రానుంది. గెలిస్తే రాష్ట్రంలో అధికార మార్పు ఖాయం అని బీజేపీ చెబుతోంది. వారు చెప్పేవి అబద్దాలు అని.. తామే గెలుస్తామని టీఆర్ఎస్ అంటోంది.

English summary
betting is will happens in munugodu by poll. thousand to 2 thousand rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X