Tellam Venkat Rao: రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులతో వెళ్లి రేవంత్ ను కలిశారు. ఆదివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెంకట్రావు కుటుంబ సమేతంగా సీఎంతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాపూర్వకంగానే కలిసినట్లు వెంకట్రావు చెప్పారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంను ఆయన కలవడం ఇది రెండోసారి. వెంకట్రావు త్వరలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యామిలీతోపాటు సీఎంను కలువడంతో చర్చకు దారి తీసింది. అయితే వెంకట్రావు హస్తం గూటి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వారికి బీజేపీలో టికెట్ కూడా వచ్చింది. రాములు బదులుగా ఆయన కొడుకు భరత్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక పెద్దపల్లి ఎంపి వెంకటేశ్ బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు.
వారంతా మార్యదపూర్వకంగానే రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెబుతున్నా.. అందులో కొంత మంది గోడ దూకెందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వారంతా హస్తం గూటికి చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిని పర్సనల్ గా కలవొద్దని.. ప్రజాక్షేత్రంలోనే కలవాలని చెప్పినా.. పలువులు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని పర్సనల్ గా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గడ్డుకాలమే ఎదురయ్యే అవకాశం ఉంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications