నేటి నుంచి భద్రాచలం సీతారాముల కల్యాణం టికెట్లు ఆన్‌లైన్‌లో..?
ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి. ఈ పండుగ అంటే హిందువులకు ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగ సందర్భంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనుకి ప్రత్యేక పూజలు చేసి, సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవి పండుగ ఏప్రిల్ నెలలో వస్తుంది. దేశంలో ప్రసిద్ధిచెందిన శ్రీరాముని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఆలయం ఎంతో ప్రసిద్ధి.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండగ సందర్భంగా ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ కళ్యాణ మహాత్సవానికి ముహుర్తం కూడా ఖరారు అయ్యింది. ఏప్రిల్ 9వ తేదీన ఉగాది నాటి నుంచి 23వ తేదీవరకు ఇక్కడ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న జరిగే సీతారాముల కళ్యాణానికి, 18వ తేదీన జరిగే పట్టాబిషేకం టికెట్లను నేటి నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

భక్తులు ఇక ఆన్‌లైన్‌లో టిక్కెట్లు పొందొచ్చని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. దేవస్థానం అధికారిక వెబ్సైట్ http://bhadradritemple.telangana.gov.in> ద్వారా ఆన్లైన్టికెట్లు పొందవచ్చని చెప్పారు. ఇక, ఈ టిక్కెట్ల ధరలను కూడా ఓసారి చెక్ చేసుకోవాల్సిందే. శ్రీరామనవమి రోజున ఉభయ దాతల టికెట్ధర 7500 రూపాయలు. ఈ టిక్కెట్‌పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. అలాగే, ఇతర సెక్టార్ రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టిక్కెట్లపై ఒక్కరికే ప్రవేశం లభిస్తుంది. అయితే, ఈ ఏడాది జరగబోయే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి వీవీఐపీ పేరుతో 10వేల రూపాయల విలువైన టికెట్లను కూడా అందుబాటులోకి ఉంచుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 18న జరిగే శ్రీరామ పట్టాభిషేకం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.300గా నిర్ణయించినట్లు ఈవో స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications