భక్తులకు గుడ్‌న్యూస్: నవమి రోజున భద్రాద్రి రామయ్య ఉచిత దర్శనం

ఖమ్మం: భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాద్రి శ్రీరామచంద్రుడి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. దీంతో భద్రాచలం రాములోరి ఆలయం (Bhadrachalam temple) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి సిద్ధమవుతోంది.

కల్యాణ క్రతువులో పాల్గొనడం, దగ్గరుండి కల్యాణాన్ని చూడటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. సీతారాముల కల్యాణాన్ని నేరుగా వీక్షిస్తే, పాపాలన్నీ తొలగిపోయి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులందరూ సీతారాముల కల్యాణాన్ని వీక్షించాలని కోరుకుంటుంటారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.

Bhadradri Ramaiah Free Darshan for devotees this navami

ఈ నేపథ్యంలోనే ప్రత్యేక అర్చనలు, వంద రూపాయలు దర్శనాలు ఆపివేసి భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తామని భద్రాచలం ఆలయ ఈవీ రమాదేవి తెలిపారు. దర్శనంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా కదిలి వచ్చే భక్తుల కోసం నిరంతరాయంగా అన్నదాన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. భక్తులంతా అధిక సంఖ్యలో కదిలి వచ్చి స్వామివారిని దర్శించుకుని, సీతారాముల కల్యాణ ఉచిత తలంబ్రాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈఓ కోరారు.

ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ప్రజాప్రతినిధులు ఈ కల్యాణ మహోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించకపోయినప్పటికీ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్.రమాదేవి పర్యవేక్షణలో రాములోరి మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు దగ్గరుడి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యక్ష ప్రసారం కోసం ఈసీ అనుమతి కోరిన మంత్రి కొండా సురేఖ

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రత్యక్షప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న జరగనున్న కల్యాణ మహోత్సవాన్ని ప్రతి ఏడాది మాదిరిగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతివ్వాలని దేవాదాయ శాఖ ఈసీకి లేఖ రాసింది. ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ఈసీ ఏప్రిల్ 4న ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారంపై మరోసారి పరిశీలించి, అనుమతివ్వాలని కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​ రాజ్‌​కు లేఖ రాశారు.

శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని, ప్రత్యక్షప్రసారం చేయడం సుమారు నలభై ఏళ్లుగా సంప్రదాయంగా ఉందని మంత్రి కొండా సురేఖ ఈసీకి వివరించారు. కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. ఆలయం మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్నందున, కల్యాణ మహోత్సవానికి భక్తులు అందరూ హాజరు కాలేరని లేఖలో పేర్కొన్నారు. లక్షలాది భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని సీఈవోను మంత్రి కొండా సురేఖ మరోసారి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+