Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే: శతజయంతి ఉత్సవాల్లో చంద్రబాబు, హీరో అంటూ బాలయ్య

హైదరాబాద్: సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని, ఇచ్చే వరకు పోరాటం సాగిస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కైత్లాపూర్ మైదానంలో ఏర్పాటు చేసిన శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు చంద్రబాబు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే దేశానికే గౌరవమన్నారు చంద్రబాబు. మే 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రతి ఇంట్లో ఆయనకు నివాళి అర్పించాలని కోరారు. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. శక్తి అని అన్నారు. తెలుగు జాతి ఆస్తి అని.. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారన్నారు. లంచాలు నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి అని కొనియాడారు.

 Bharat Ratna

రాయలసీమకు కరువు వస్తే చందాలు వేసి ఎన్టీఆర్ ఆదుకున్నారని చంద్రబాబు చెప్పారు. దివిసీ ఉప్పెన బాధితులను ఆదుకున్నారన్నారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక మహాశక్తి. ఆయన్ను తలచుకుని ఏ కార్యక్రమం చేపట్టినా జయప్రదమవుతుందన్నారు.

హైదరాబాద్ పరిసరాల్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ సంకల్పించిందని.. దీనికి సహకరించాలన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు శ్రమించిన కమిటీ సభ్యులను చంద్రబాబు అభినందించారు.

 Bharat Ratna

ఎన్టీఆర్.. రాజకీయాల్లోనూ హీరోనే: బాలకృష్ణ

వందేళ్ల క్రితం వెలిగిన ఎన్టీఆర్ అనే జ్యోతి వెయ్యేళ్లకు సరిపడా కాంతినిచ్చిందని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. తన జన్మని తెలుగు జాతికి అంకితం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ పేరును తలచుకుంటేనే తెలుగు జాతి పులకరిస్తుందన్నారు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయమని.. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత ఆయనదేనని అన్నారు. సినిమా రంగంతోపాటు రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ హీరో అనిపించుకున్నారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పేదలు, మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారన్నారు. ఎన్నో సామాజిక సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనని నినదించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

 Bharat Ratna

ఎన్టీఆర్ శకపురుషుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ దత్తాత్రేయ

శతజయంతి వేడుకలో 'ఎన్టీఆర్ శకపురుషుడు' పుస్తకాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. సినీ రంగానికి ఎనలేని సేవ చేశారని, నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకు మారు పేరు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేక ముద్రను వేశారన్నారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు.

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. పేదలు కష్టాలు తెలిసిన నిజమైన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడని.. కోట్లాది మంది ప్రజల మనసు దోచుకున్నారన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి దేవుడు ఎలా ఉంటాడని గుర్తు చేసుకుంటే.. ఎన్టీఆర్ గుర్తుకు వస్తారన్నారు. రాజ్యాంగం హక్కుల్ని కాపాడేందుకు ఎన్టీఆర్ చివరి వరకు కృషి చేశారన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబసభ్యులు, ప్రముఖు సినీనటులు వెంకటేష్, రాంచరణ్ తేజ్, నాగచైతన్య, విశ్వక్ సేన్, పలువురు రాజకీయ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+