గుజరాత్‌లో కన్నా తెలంగాణ వాటర్ గ్రిడ్ గొప్పగా ఉంది: భట్టాచార్య
మెదక్ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వాటర్‌గ్రిడ్ గుజరాత్‌లో చేపట్టిన వాటర్‌గ్రిడ్ కంటే మెరుగైనదని పశ్చిమ బెంగాల్ వాటర్, శానిటేషన్ డైరెక్టర్ అనిమేష్ భట్టాచార్య ప్రశంసించారు. మెదక్ జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు వద్ద చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పన లు, నమూనాను ఆయన పరిశీలించి మాట్లాడారు.

గుజరాత్ తాగునీటి పథకాలను కూడా పరిశీలించామని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకం ఉద్దేశాలు బాగున్నాయని తెలిపారు. వాటర్‌గ్రిడ్ పథకం అమలు సాహసంతో కూడుకున్నదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకాన్ని రెండు మూడు నెలలుగా ప్రసార మాధ్యమాల ద్వారా అధ్యయనం చేసి అమలు చేయాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పారు.

పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విజన్-2020లో భాగం గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నదని చెప్పారు. వాటర్‌గ్రిడ్ అమలుచేయడానికి తెలంగాణ రాష్ట్ర సహాయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతివ్యక్తికి 100 నుంచి 150 లీటర్ల నీరు సరఫరా చేయలని సంకల్పించిందని, తాము మాత్రం ప్రతి వ్యక్తికి 60 లీటర్లు అందివ్వాలనుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌తో బెంగాల్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు.

బెంగాల్ వాటర్ బోర్డు చీఫ్ ఇంజినీర్ అమినేష్ భట్టాచార్యతో కూడిన బెంగాల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ బృందం గురువారం మెదక్ జిల్లా సింగూరులో నిర్మిస్తున్న రెండు ఇన్‌టేక్ వెల్‌ల నిర్మాణాలను పరిశీలించింది. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు లాంటి పథకం ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావిస్తున్నారని, దీదీ మెచ్చిన ఈ ప్రాజెక్టును తమ రాష్ట్రం కూడా చేపట్టే అవకాశం ఉందని భట్టాచార్య అన్నారు.
ఇన్‌టేక్ వెల్ ద్వారా నీటినిల్వతోపాటు శుద్ధిచేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. డబ్ల్యూటీపీ సామర్థ్యంతోపాటు దగ్గర్లోని ఓహెచ్‌బీఆర్, జీఎల్‌బీఆర్, గ్రామాల సంఖ్య గురించి వాకబు చేశారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణాలు జరుగుతున్నాయని అభినందించారు.












Click it and Unblock the Notifications