భూపాలపల్లిలో మాజీ స్పీకర్ సిరికొండ పరపతి తగ్గుతుందా? కేటీఆర్ పర్యటన చెప్పింది అదేనా!!
భూపాలపల్లి నియోజకవర్గం లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు కేటీఆర్ పర్యటన సాక్షిగా బయటకు వచ్చింది. గతంలో తెలంగాణ స్పీకర్ గా పనిచేసిన, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సిరికొండ మధుసూదనా చారికి స్థానికంగా ప్రాధాన్యత తగ్గడం, ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించడమే కాకుండా, ఆయన అనుచరులలోను ఆగ్రహానికి కారణమైంది. కేటీఆర్ పర్యటన సాక్షిగా భూపాలపల్లి లో సిరికొండ మధుసూదనాచారికి ప్రాధాన్యత తగ్గుతున్నది అన్న అంశం తెర మీదకు వచ్చింది. ఇంతకీ కేటీఆర్ పర్యటనలో ఏం జరిగిందంటే..

ఎమ్మెల్సీ మధుసూదనాచారికి కేటీఆర్ పర్యటనలో అవమానం
కేటీఆర్ పర్యటనలో కేటీఆర్ ని స్వాగతించటానికి వచ్చిన సిరికొండ మధుసూదనా చారిని, ఆయన అనుచరులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్ గణపురం మండలంలో పర్యటిస్తున్న క్రమంలో ఆయన హెలీ ప్యాడ్ వద్దకు వెళ్తున్న మాజీ స్పీకర్, తాజా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి కి చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్ కు స్వాగతం పలకడానికి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు వెళుతున్న క్రమంలో గణపురం ప్రధాన రోడ్డుపై ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు .

మధుసూదనాచారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ స్పీకర్
ఆపై తాను మధుసూదనాచారి తాను ఎమ్మెల్సీ అని చెప్పడంతో ఆయన వాహనాన్ని పోలీసులు వదిలిపెట్టారు. అనంతరం ఆయనతో పాటు వచ్చిన పలువురు నాయకుల వాహనాలను సైతం పోలీసులు అడ్డుకోవడంతో మధుసూదనాచారి ఆగ్రహానికి గురయ్యారు. నన్ను నాతో పాటు వచ్చిన నాయకులను అడుగడుగునా అడ్డుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు వాహనాన్ని హెలిపాడ్ వద్దకు వెళ్లడానికి అనుమతించిన తర్వాత హెలిపాడ్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన మరో బందోబస్తు వద్ద కూడా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో సిరికొండ మధుసూదనాచారి తీవ్ర అసహనానికి గురయ్యారు.

గతంలో కవిత పర్యటనలోనూ చారికి అవమానం
కేటీఆర్ పర్యటనలో కావాలని సిరికొండ మధుసూదనాచారిని అవమానించారని ఆయన అనుచరులలో చర్చ జరుగుతుంది. ఇక కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత పర్యటనలో కూడా టీబీజీకేఎస్ భవన్ నిర్మాణ శంకుస్థాపన ఫలకంలో సిరికొండ మధుసూదన చారి పేరు లేకపోవడం ఆయన అనుచరులను ఆగ్రహానికి గురిచేసింది. అప్పుడు కూడా చారి అనుచరులు కవిత ముందే నినాదాలతో హోరెత్తించారు. కావాలని స్థానికంగా ఆయన ప్రాధాన్యతను తగ్గించడానికి ఒక వర్గం ప్రయత్నం చేస్తుంది అన్న చర్చ జోరుగా జరుగుతుంది.

కేటీఆర్ పర్యటన సాక్షిగా బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు
గత ఎన్నికల్లో మధుసూదనా చారి ఓటమి పాలు కావటంతో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం సిరికొండ మధుసూదనా చారి పేరు ఎక్కడా లేకుండా చేస్తున్నారని మధుసూదనా చారి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ సభ లోను ఆద్యంతం బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు కనిపించింది. సిరికొండ మధుసూదనా చారి, గండ్ర వర్గీయులు నినాదాలతో హోరెత్తించారు.

చారి వర్సెస్ గండ్ర .. పంచాయితీ ఏ రూపం తీసుకుంటుందో?
మొత్తానికి ఒకప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో ఏకచిత్రాధిపత్యంగా ఉన్న సిరికొండ మధుసూదనా చారి ఆధిపత్యాన్ని గండ్ర తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందని స్థానికంగా చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే స్థానికంగా బీఆర్ఎస్ నేతల మధ్య పొసగని తీరు బీఆర్ఎస్ కు నష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఈ పంచాయితీ ఏ రూపం తీసుకుంటుందో వేచి చూడాలి.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications