తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త! త్వరలోనే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించే మహాలక్ష్మి పథకాన్ని అందిస్తామని ప్రకటించింది.

ఆ పథకం అమలుకు తెలంగాణా సర్కార్ సన్నాహాలు
ఈ క్రమంలో ఆ పథకాన్ని ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా సంవత్సరానికి మహిళలకు 30 వేల రూపాయల ఆర్థిక భరోసా అందనుంది. ఈ పథకం ద్వారా 55 సంవత్సరాలలోపు వయసున్న తెల్ల రేషన్ కార్డు కలిగిన మరియు పెన్షన్ సౌకర్యం లేని మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Big good news for Telangana women Cash will be deposited in their accounts soon

Take a Poll

మహాలక్ష్మీ పథకంపై వేగంగా కసరత్తు
మహాలక్ష్మి పథకంలో భాగంగా అందించే ఈ ఆర్థిక సహాయాన్ని త్వరితగతిన ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను వేగంగా రూపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే దీనిని ఇవ్వగలిగితే ప్రజల మద్దతు పూర్తిస్థాయిలో పొందే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే అనేకమార్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే తెలంగాణ మహిళలకు శుభవార్త చెబుతారని పేర్కొన్నారు .

ఎన్నికల ముందు మహిళల ఖాతాలో డబ్బులు
జూలై నెలలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, త్వరలో క్యాబినెట్ భేటీ నిర్వహించి ఎన్నికల తేదీని ప్రకటిస్తారని చెబుతున్న క్రమంలో ఎన్నికలకు ముందు మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయడం ద్వారా ప్రజా మద్దతును కూడగట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రైతు భరోసా నిధుల ద్వారా రైతాంగం మద్దతును కూడగట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతున్న తెలంగాణ ప్రభుత్వం
ఇదే సమయంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాలో ఇచ్చిన మాట ప్రకారం 2500 రూపాయల నగదును జమచేసి ఆర్థిక భరోసా కల్పించి రెండు ముఖ్యమైన పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజలలో విశ్వాసం పెంచుకోవాలని భావిస్తుంది. ఎన్నికల హామీలను నెరవేర్చడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టు సాధించాలని, తద్వారా రాష్ట్రంలో మళ్లీ బలంగా గ్రామీణ స్థాయిలో పాగా వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+