జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు షాక్ ఇవ్వడానికి జిహెచ్ఎంసి రెడీ అయింది. గత కొన్నేళ్లుగా జిహెచ్ఎంసి పరిధిలో భారీ ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయిన క్రమంలో వారి జాబితాను సిద్ధం చేస్తున్న జిహెచ్ఎంసి త్వరలో వారికి ఊహించని షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది.
జిహెచ్ఎంసికి తలనొప్పిగా ఆస్తిపన్నుల వసూలు
జిహెచ్ఎంసి పరిధిలో బడా వ్యాపారులు కార్పొరేట్ సంస్థలు, హోటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించేవారు కోట్ల రూపాయల ఆస్తి పన్నులను ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు. ప్రతి సంవత్సరం వీరి వద్ద నుండి ఆస్తి పన్నులను వసూలు చేయడం జిహెచ్ఎంసికి తలనొప్పిగా మారింది. ఇది ఖజానా ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అభివృద్ధి పనుల పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

పన్ను ఎగవేతదారులపైన ఉక్కుపాదం
ప్రతి సంవత్సరం ఆస్తి పన్నుల వసూలు లక్ష్యాన్ని నిర్ధారించుకున్నా, ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు విఫలం అవడంతో వందల కోట్ల రూపాయల మొండి బాకీలు పేరుకుపోయాయి.ప్రస్తుతం ఈ బాకీలను వసూలు చేయలేకపోయిన జిహెచ్ఎంసి పన్ను ఎగవేతదారుల పైన ఉక్కుపాదం మోపడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా భారీ బకాయిలు ఉన్న వారి జాబితాను సిద్ధం చేసి ఆస్తుల స్వాధీన ప్రక్రియను ప్రారంభించింది.
పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు
నగరంలోని ఖరీదైన జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల ప్రముఖ వాణిజ్య ఆస్తుల యజమానులు బకాయిదారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారని గుర్తించిన అధికారులు వారికి చివరి హెచ్చరికగా రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నోటీసులు తర్వాత కూడా వారు బకాయిలు చెల్లించకపోతే జిహెచ్ఎంసి చట్టంలోని సెక్షన్ 269 ప్రకారం డిస్ట్రెస్ వారెంట్లు జారీ చేసి వారి ఆస్తులు షాపులు వాహనాలను కూడా తప్పు చేయడానికి నిర్ణయించారు.
వెయ్యి కోట్ల రూపాయల పన్నుల వసూలు చేయాల్సి ఉన్న జీహెచ్ఎంసీ
2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో బకాయిల వసూళ్లపై దృష్టి సారించిన అధికారులు మార్చి 31వ తేదీ లోపు మూడు కార్పొరేషన్లకు కలిపి 3 వేల కోట్ల ఆస్తి పన్ను లక్ష్యం కాగా ఇప్పటికి రెండు వేల కోట్ల రూపాయల పన్ను వసూలు చేశారు. ఇంకా మిగిలిన ఒక వెయ్యి కోట్ల రూపాయల పన్నులను వసూలు చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు.
మొండి బకాయిదారుల ఆస్తుల జప్తుకు రంగం
ఒకవైపు మొండి బకాయి దారులకు వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద వడ్డీలో మినహాయింపు ఇస్తుంటే మరోవైపు ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వాళ్ళకి ఇస్తున్నారు. ఇక మొండి బకాయిదారుల ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications