ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డికి బిగ్ షాక్!!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును పొందే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ తమకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఓటర్ల నుంచి ఒక్కొక్కసారి అభ్యర్థులకు నిరసన సెగ తగులుతుంది.
తాజాగా BRS పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రజల నుంచి ఊహించని షాక్ తగిలింది. గంగాసముద్రం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతులకు రుణమాఫీ ఎక్కడ?మా ఊరికి దళిత బంధు ఎందుకు రాలేదు?డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రొసీడింగ్స్ ఎక్కడికి పోయాయి? మన ఊరు-మన బడి అంటివి అవన్నీ ఏమయ్యాయి? అంటూ ప్రశ్నలు సంధించారు.

కొత్త బీడీ పింఛన్లు ఎక్కడికి పోయాయి? కొత్త ఇల్లు కొత్త పేర్ల నమోదు ప్రక్రియ ఎక్కడికి పోయింది? బీసీ బంధు అందరికీ ఇచ్చేది ఎప్పుడు? అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ తగిలినట్టు అయింది. నియోజకవర్గం లో చాలాచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పై వ్యతిరేఖత వ్యక్తం కావటం ప్రధానంగా కనిపిస్తుంది.
ఆర్మూరు నియోజక వర్గం నుంచీ గత రెండు సార్లూ TRS నుంచి ఆశన్నగారి జీవన్ రెడ్డి గెలిచారు. KCR కు సన్నిహితులుగా పేరున్న జీవన్ రెడ్డి మరో సారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుండి వినయ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. BJP ఇక్కడ P రాకేశ్ రెడ్డిని బరిలోకి దింపింది. గతంలో ఇక్కడ ఓటమి పాలైన ఆలేటి అన్నపూర్ణమ్మ ప్రస్తుతం బాల్కొండ నుంచి పోటీ చేస్తున్నారు.

పసుపు రైతుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఆర్మూరులో సామాజిక వర్గాల సమీకరణాలూ కీలకంగా మారాయి. అయితే ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి పై నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని స్థానిక ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఇక్కడ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
-
విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications