బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ - జాబితాలో నెక్స్ట్..!!
బీఆర్ఎస్కు షాక్‌లు మీద షాక్‌లు తప్పటం లేదు. ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ వీడుతున్నారు. బీఆర్ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారం రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా మరింత మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో, బడ్జెట్ సమావేశాల నాటికి బీఆర్ఎస్ కు మిగిలే ఎమ్మెల్యేల సంఖ్య పైన చర్చ మొదలైంది.
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి వరుసకట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో ఈ వలసలు మెదలయ్యాయి. ఆ తరువాత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. వారం రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు.

పోచారం జాయిన్ అయిన రెండు రోజుల గ్యాప్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ బలం 32మందికి చేరుకుంది.

సార్వత్రిక ఎన్నికల తర్వాత మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరుకున్నారు. ఇక ఇవాళ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications