ఫార్ములా ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఈడీ సంచలన లేఖతో కేటీఆర్ షాక్!
ఫార్ములా ఈ రేస్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టగా, ఈడి కూడా రంగంలోకి దిగినట్టు తాజా పరిణామాలతో తెలుస్తుంది. ఈ మేరకు తాజాగా తెలంగాణ ఏసీబీ డీజీ విజయ్ కుమార్ కు హైదరాబాద్ ఈడి జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లేఖ రాశారు.
ఏసీబీ డీజీకి ఈడీ లేఖలో కీలక విషయాలు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనే నమోదైన కేసు వివరాలను తమకు అందజేయాలని ఆ లేఖలో హైదరాబాద్ ఏడి జాయింట్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తో పాటుగా హెచ్ఎండిఏ సంస్థ అకౌంట్ నుంచి ఎంత మొత్తం నిధులను బదిలీ చేశారు అని పూర్తి వివరాలు కూడా కావాలని ఆయన పేర్కొన్నారు.

ఆ వివరాలన్నీ కావాలన్న ఈడీ
ముఖ్యంగా ఈ నగదు బదిలీకి సంబంధించి ఏ ఏ తేదీలలో ట్రాన్సాక్షన్స్ జరిగాయో వివరాలతో సహా పంపాలని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇక ఇదే సమయంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఫిర్యాదు కాపీని కూడా తమకు పంపాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఏసీబీ డిజి కి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏ వన్
ఇదిలా ఉంటే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడంతో ఆయన అరెస్టు అవుతారని తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందులో కేటీఆర్ ఏ వన్ కాగా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ 2 గా ఉన్నారు.
కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం
హెచ్ ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి ఎల్ ఎన్ రెడ్డి ఏ 3గా ఉన్నట్టు తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు విషయంలో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణాన అయినా ఆయనను అరెస్ట్ చెయ్యొచ్చని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో కేటీఆర్ పిటీషన్ పై విచారణ
అయితే కేటీఆర్ తరపు లాయర్లు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ దీనిని తిరస్కరించారు. దీంతో సీజే బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయగా లంచ్ మోషన్ పైన నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పిటిషన్ పైన మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications