ఖమ్మం సభకు దూరంగా ఆ నేతలు -బిహార్ సీఎం నితీశ్ కీలక వ్యాఖ్యలు..!!
ఖమ్మంలో బీఆర్ఎస్ సభలో కొందరు ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. కేసీఆర్ కు అన్నింటా మద్దతు ప్రకటించిన ఆ నేతలు ఈ సభకు హాజరు కాలేదు. వారిని ఆహ్వానించ లేదా. ప్రత్యేక కారణాలతో వారే దూరంగా ఉన్నారా. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ రాజకీయ పోరాటం ప్రారంభించటంతో.. సభ పైన జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. సభలో హాజరైన వారి కంటే రాని వారి గురించే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీఆర్ఎస్ సభకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు.

బీఆర్‌ఎస్ సభపై సమాచారం లేదు
ఖమ్మంలో బీఆర్ఎస్ సభను గులాబీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటుగా సీపీఐ నేత రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ హాజరయ్యారు. మిగిలిన నేతలు పాల్గొన లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ - బీజేపేయతర పార్టీల నేతలతో కొద్ది నెలలుగా కేసీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ, బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా భావించిన సభకు మాత్రం కీలక నేతలు కొందరు దూరంగా ఉన్నారు. దీని పైన స్పందించిన నితీశ్..''కేసీఆర్ ఆ సభ నిర్వహిస్తున్న సంగతి నాకు తెలియదు. నేను ఇతర పనుల్లో బిజీగా ఉన్నాను. కేసీఆర్ పార్టీ సభకు ఆహ్వానం అందుకున్న వారంతా అక్కడికి వెళ్లారు'' అని చెప్పుకొచ్చారు. అయితే, నితీశ్ ను బీఆర్ఎస్ ఆహ్వానించకపోవటం వెనుక కారణాలు ఏంటనే చర్చ మొదలైంది. అదే విధంగా జాతీయ స్థాయిలో బీజేపీ పైన వ్యతిరేక గళం వినిపిస్తున్న ప్రధాన నేతలు ఖమ్మం సభకు హాజరు కాలేదు.

ఆ నేతలు దూరం కావటం వెనుక..
కేసీఆర్ గతంలో స్వయంగా కలిసిన పశ్చిమబెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీఎస్ నేత కుమారస్వామి, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తదితరులెవరూ బీఆర్‌ఎస్ తొలి సభకు వెళ్లకపోవడం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల ఐక్యత అవసరమని చెబుతున్న నితీశ్, తేజస్వి వెళ్లకపోవడం పైన చర్చ మొదలైంది. అయితే, కేసీఆర్ పిలిచిన వారే ఖమ్మం వెళ్లారంటూ నితీశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. అదే సమయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నడిస్తే చూడాలని ఉందని నితీశ్ వ్యాఖ్యానించారు. అంతకుమించి తనకు ఇంకేమీ అవసరం లేదని.. అదే తన ఏకైక స్వప్నమని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానని గుర్తు చేసారు. విపక్షనేతలంతా కలిసి ముందుకు సాగితే దేశానికే ప్రయోజనకరమని నితీశ్ పేర్కొన్నారు. ఇప్పుడు నితీశ్ వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో విపక్ష పార్టీల ఐక్యత పైన కొత్త చర్చ మొదలైంది.

బీఆర్ఎస్ తో కొనసాగే జాతీయ నేతలెవరు..
బీజేపీ పైన రాజకీయ పోరాటం నిర్ణయించిన కేసీఆర్.. కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్ని విపక్ష పార్టీల నేతలతోనూ సమావేశమయ్యారు. అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మద్దతు కూడగట్టారు. కానీ, ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. ఇప్పుడు ఖమ్మం సభలోనూ కొందరు ముఖ్య నేతల గైర్హాజరు వెనుక కారణలపైన కొత్త చర్చ మొదలైంది. తమను ఖమ్మం సభకు ఆహ్వానించలేదని జేడీయూ, ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కొన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. కాంగ్రెస్ తో కలవటానికి కేసీఆర్ సిద్దంగా లేరు. ఇప్పుడు నాన్ కాంగ్రెస్ - నాన్ బీజేపీ పార్టీల వేదికగా బీఆర్ఎస్ చెబుతున్న వేళ కొన్ని పార్టీలు దూరంగా ఉంటున్నాయని విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీపై గెలుపు సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో భాగంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ తో ఇప్పటికిప్పుడు కలిసే అవకాశం లేదు. దీంతో.. బీఆర్ఎస్ తో కలిసి వచ్చే పార్టీల పైన క్లారిటీ రావాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications