టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన రైతులు ..పోలీసుల లాఠీచార్జ్

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి రైతుల నుండి చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో పర్యటించిన ఆయనపై గ్రామస్తులు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే గొ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు , రైతులు , యువత ఆయన వాహనంపై చెప్పులతో దాడి చేశారు .

ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఘోర పరాభవం .. ఫార్మాసిటీ విషయంలో రైతుల ఆగ్రహం

ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఘోర పరాభవం .. ఫార్మాసిటీ విషయంలో రైతుల ఆగ్రహం

తాజాగా కురుస్తున్న వర్షాలతో గ్రామంలోని చెరువు నిండడంతో పూజలు చేసేందుకు వెళ్లిన, అదేవిధంగా వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించాలి అనుకొని మేడిపల్లి గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన బాధలో ఉన్న రైతులు మంచిరెడ్డి పర్యటన నేపథ్యంలో ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, గ్రామస్తులకు తీవ్ర వాగ్వాదం జరిగింది.ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఘోర పరాభవం .. ఫార్మాసిటీ విషయంలో రైతుల ఆగ్రహం

రైతులు ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి వాహనంపై చెప్పులు విసిరారు.

రైతులు ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి వాహనంపై చెప్పులు విసిరారు.

మేడిపల్లి గ్రామం ఫార్మాసిటీలో పోతుందని, అక్కడ సాగు చేసుకుంటున్న భూములు నిర్దాక్షిణ్యంగా లాక్కుంటున్నారని అందుకు కారణం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తమ గ్రామంలోకి రావొద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ రోజు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యటన దృష్ట్యా ఆందోళనకారులను కొందరిని పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. అయినాసరే కిషన్ రెడ్డికి పరాభవం తప్పలేదు .

ఎమ్మెల్యే రాజీనామా చెయ్యాలని డిమాండ్

ఎమ్మెల్యే రాజీనామా చెయ్యాలని డిమాండ్

ఈ రోజు ఉదయం నుండే గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు . కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్ రావడంతో అడ్డుకోవడానికి రైతులు, గ్రామస్తులు ప్రయత్నించారు . ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ గ్రామస్తులు నినాదాలతో హోరెత్తించారు.

 పోలీసుల లాఠీ చార్జ్ .. ఆందోళనకారుల అరెస్ట్

పోలీసుల లాఠీ చార్జ్ .. ఆందోళనకారుల అరెస్ట్

ఎమ్మెల్యే కారుపై చెప్పులు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను అరెస్టు చేశారు. అయితే గ్రామంలో గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో మాట్లాడిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఫార్మాసిటీ కి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. కానీ మేడిపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది . ఫార్మా సిటీ కోసం బంగారం పండే భూములను ఇవ్వలేమని వారు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+