చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కి కూడా.. తుకుడే గ్యాంగ్ ఆశలు గల్లంతే !! : బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో అత్యంత అవినీతిపరుడుని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కల్వకుంట్ల వారి కుటుంబం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. వారి అవినీతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీశారని దుయ్యబట్టారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకోక వేషం వేస్తున్నారని మండిపడ్డారు.

 కేసీఆర్ జెైలుకు వెళ్లడం ఖాయం

కేసీఆర్ జెైలుకు వెళ్లడం ఖాయం

అవినీతి , అక్రమాల కేసులో కేసీఆర్ జెైలుకు వెళ్లడం ఖాయం అని బండి సంజయ్ హెచ్చరించారు. అందుకే తనను తాను రక్షించుకునేందుకు ఇప్పుడు దేశ రాజకీయాల ప్రస్తావన తీసుకువస్తూ పబ్బం గుడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఏలేందుకు కేసీఆర్ ఏవో ప్రయత్నాలు చేస్తున్నారని .. అవన్నీ కలలుగానే మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు. అసలు ఈ ముఖ్యమంత్రి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని సంజయ్ నిలదీశారు.

 చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కి కూడా..

చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కి కూడా..

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇలానే అన్ని రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను కలిశారు. ఇవాళ ఆయనకు ఏదీ లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్‌కి కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కేసీఆర్ ఏమీ ఉద్దరించలేరని దుయ్యబట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని మండిపడ్డారు. దేశ వ్యతిరేక భావజాలంతో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు.

Recommended Video

    Third Front Will Be Utter Flop కేసీఆర్ ఒటమి ఖాయం - BJP MLA Raghunandhan Rao | Oneindia Telugu
     తుకుడే గ్యాంగ్ ఆశలన్నీ కలలుగానే ..

    తుకుడే గ్యాంగ్ ఆశలన్నీ కలలుగానే ..

    దేశ భద్రతను ప్రశ్నించిన వ్యక్తిని సీఎం కేసీఆర్ వెంటేసుకుని తిరుగుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. అసలు తుకుడే గ్యాంగ్‌ని ముంబై తీసుకెళ్లడంలో ఆంతర్యమేంటి ? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్తామన్న కేసీఆర్ పిలుపుకి స్పందన కరువైందని చురకలు అంటించారు. తుకుడే గ్యాంగ్ ఆశలన్నీ కలలుగానే మిగులుతాయని సెటైర్లు విసిరారు. తెలంగాణలో తిరగలేని పరిస్థితి కేసీఆర్‌కు వచ్చిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు కాబట్టే మేడారం జాతరకు ముఖం చాటేశారని సంజ‌య్ విమర్శించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+